• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL TOTALLY CHANGED HERE ARE THE KEY POINTS TA

ఒట్టు.. నేను పూర్తిగా మారిపోయానంటున్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

ఒట్టు.. నేను పూర్తిగా మారిపోయానంటున్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ (Instagram/Photo)

Nihhi Agerwal | ఒట్టు.. నేను పూర్తిగా మారిపోయానంటుంది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    ఒట్టు.. నేను పూర్తిగా మారిపోయానంటుంది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్. వివరాల్లోకి వెళితే.. స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా మంచి విజయం సాధించింది. అంతకు ముందు టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు. కానీ.. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటు టాలీవుడ్‌ మరియు అటు కోలీవుడ్‌లో చాలా బిజీ అయిపోయింది.అంతేకాదు వారంలో రెండు మూడు ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీట్‌ పుట్టిస్తూనే ఉంది. అయితే ఇటీవల తన రూటుమార్చి సాంప్రదాయ చీరకట్టులో తమిళ సంప్రదాయం ఉట్టి పడేలా ఫొటోను పోస్ట్‌ చేసింది ఈ బ్యూటీ. దీంతో షాక్ అయిన అభిమానులు ఈ ప్రవర్తనపై నిధిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి బోర్‌ కొట్టిందనీ, అందుకే జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం చీర కట్టిన ఫొటోలను విడుదల చేసినట్లు చాలా సింపుల్‌గా బదులిచ్చింది నిధి.




    ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి సారించడంతో ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమే ఇదని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఖరీదయిన కారు కొని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నిధి పైనా నెటిజన్లు రెమ్యూనిరేషన్ ఎంతకు పెంచేశావంటూ చిలిపి కామెంట్స్‌తో హోరెత్తెస్తున్నారు. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ హిట్ తో నిధికుడా తన పారితోషకాన్ని మూడింతలు పెంచేసినట్లు టాక్.








    View this post on Instagram





    Good morning 🙏🏼


    A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on





    ఇప్పుడీ బ్యూటీ లక్కీ హీరో జయం రవితో భూమి అనే చిత్రంలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: