• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL SUFFERED WITH HER FANS IN RAJAMUNDRY HERE ARE THE DETAILS TA

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌‌కు ఓ రేంజ్‌లో చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. బౌన్సర్స్ సాయంతో భయటపడ్డ ఇస్మార్ట్ పోరి..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌‌కు ఓ రేంజ్‌లో చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. బౌన్సర్స్ సాయంతో భయటపడ్డ ఇస్మార్ట్ పోరి..

నిధి అగర్వాల్ (Twitter/Photo)

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్‌‌ను ఓ రేంజ్‌లో చూపించిన ఫ్యాన్స్.. బౌన్సర్స్ సాయంతో భయటపడ్డ ఇస్మార్ట్ పోరి.. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Nidhhi Agerwal:  నిధి అగర్వాల్‌‌ను ఓ రేంజ్‌లో చూపించిన ఫ్యాన్స్.. బౌన్సర్స్ సాయంతో భయటపడ్డ ఇస్మార్ట్ పోరి.. వివరాల్లోకి వెళితే..  అభిమాని లేనిదే హీరోలు లేరు.. హీరోయిన్స్ లేరు. నాయకా, నాయికలు కూడా తమతో ఎలాంటి రక్త సంబందం లేకున్నా తమపై చూపించే ప్రేమాభిమానాలకు ఎంతో పొంగిపోతుంటారు. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే.. అవతలి వైపు మరో కోణం ఉంది. ఒక్కోసారి అభిమానం అనేది హద్దుల దాటుతూ ఉంటుంది. దీంతో ఆయా  సందర్భాల్లో హీరోలు, హీరోయిన్స్‌ను కొంత మంది  ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక అభిమానం పేరుతో కొంత మంది  వెర్రి చేష్టలతో సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్‌తో ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. తాజాగా ఈమె రాజమహేంద్రవరంలో అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న షూటింగ్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని కొంత మంది నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

    దీంతో ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కాస్త ఇబ్బందులకు గురైంది. నిధి అగర్వాల్ చుట్టూ బౌన్సర్లు ఉన్న.. కొంత మంది ఆకతాయిలు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. మరికొందరు ఆమెను టచ్ చేయాలని చూసారు. నిధి మేడమ్ అంటూ కేకలు వేసారు. ఆమె వెళ్లే వాహానాన్ని కూడా చుట్టుముట్టి చుక్కలు చూపించారు. అభిమానులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్న ఎంతో సహనంతో వారికి అభివాదం చేసుకుంటూనే తన కారు దగ్గరికి వడి వడిగా చేరుకుంది. అయినా అభిమానులు ఆమెతో సెల్ఫీలో దిగాలనే ఆతృతతో ఆమె వెంట పడ్డారు. అయితే బౌన్సర్ల సహాయంతో నిధి అగర్వాల్.. ఎలాగో అలా ఈ పరిస్థితి నుండి బయటపడి తన కారులో అక్కడ నుంచి వెళ్లి పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    నిధి అగర్వాల్ విషయానికొస్తే..  సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. తన ఇస్మార్ట్ అందాలతో ఇప్పుడు రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళనాట ప్రస్తుతం హాట్ హీరోయిన్ అయిపోయింది నిధి. దాంతో పాటు మధ్యలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది నిధి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు