Nidhhi Agerwal : టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్లు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటిది... ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న నిధి అగర్వాల్ మాత్రం... ముందూ వెనకా ఆలోచించకుండా డైలాగ్స్ పేల్చేస్తోంది. హిందీ సినిమా 'మున్నామైఖెల్'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ హైదరాబాదీ పోరీ. బెంగళూరులో పెరిగిన ఈ భామ... మోడల్‌గా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకొని... ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో హిట్ కాకపోయినా... తెలుగులో... సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. 2020కి మరో రెండు సినిమాలు భూమి (తమిళం), అశోక్ గల్లా (తెలుగు) రిలీజ్ కాబోతున్నాయి. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ... అందాల ఆరబోతతో... ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న నిధి... తాజాగా చేసిన ఓ కామెంట్ మాత్రం ఫ్యాన్స్‌ని హర్ట్ చేసింది.
అదే పనిగా ఇన్‌స్టాగ్రాంలో తననే చూస్తున్నారని, తనకోసమే గంటల తరబడి వెతుకుతున్నారని అనుకుందో ఏమో గానీ... ఓ హాట్ కామెంట్ పెట్టింది. "ఇన్‌స్టాగ్రాంలో వెతికే దాని కంటే ఎక్కువగా... మిమ్మల్ని మీరు వెతుక్కోండి" అని సెటైర్ వేసింది. ఈ కామెంట్ ద్వారా... తన కోసం ఇన్‌స్టాగ్రాంలో టైమ్ వేస్ట్ చేసుకోవద్దనీ... దాని బదులు... ఫ్యాన్స్ ఎవరికి వారు తమ టాలెంట్ ఏంటో, తమలో దాగి వున్న ప్రతిభ ఏంటో తెలుసుకుంటే మేలనే సూచన నిధి చేసినట్లు కనిపిస్తోందంటున్నారు కొందరు. ఏది ఏమైనా... తనను మెచ్చుకుంటున్న వారే... నొచ్చుకునేలా ఈ కామెంట్ పెట్టడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి వారిని ఓదార్చేందుకు నిధి... ఏ అందాల విందు చేస్తుందో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.