తెలుగులో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో మెరిసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకుంది. తాజాగా నిధి అగర్వాల్.. మంచు లక్ష్మీ వీట్ అనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్’లో క్రికెటర్ కే.ఎల్.రాహుల్‌తో తన ఎఫైర్ విషయమై వస్తున్న రూమర్లపై స్పందించింది. రాహుల్‌తో నేను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను సైతం ఖండించింది. మేమిద్దరం మంచి స్నేహితులము మాత్రమే.. మా మధ్య ఫ్రెండ్షిప్ తప్పించి మరోటి లేదని కుండబద్దలు కొట్టింది.

మంచు లక్ష్మీ షోలో నిధి అగర్వాల్ (Voot/Photo)
నేను లండన్‌లో ఉన్నపుడు పాకిస్థాన్ పై భారత్ క్రికెట్ మ్యాచ్ గెలిచింది. ఆ సమయంలో నేను భారత క్రికెట్ బృందాన్ని కలిసి విషెస్ అందించాను.అపుడే నేను కేఎల్ రాహుల్‌ను కలిశాను. నాకు రాహుల్ బాగా తెలుసు.మా గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు అని చెప్పుకొచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 19, 2019, 16:42 IST