• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL REQUEST TO HER FANS TO GIVE SHELTER EDUCATION AND FOOD FOR NEEDY SR

Nidhhi Agerwal: ఆ మూడు కోరికలను తీర్చండి.. తనకు గుడి కట్టిన ఫ్యాన్స్‌కు నిధి అగర్వాల్ రిక్వెస్ట్..

Nidhhi Agerwal: ఆ మూడు కోరికలను తీర్చండి.. తనకు గుడి కట్టిన ఫ్యాన్స్‌కు నిధి అగర్వాల్ రిక్వెస్ట్..

Nidhhi Agerwal temple Photo : Twitter

Nidhhi Agerwal: నిధి అగర్వాల్.. కొత్తగా పరిచయం చేయనక్కర లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది.

  • Share this:
    నిధి అగర్వాల్.. కొత్తగా పరిచయం చేయనక్కర లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో సైటింస్ట్ పాత్రలో నిధి వావ్ అనిపించింది. అయితే అది ఆమె మొదటి సినిమా కాదు. నిధి అగర్వాల్ 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ. తొలి సినిమాతోనే అక్కడ అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ఇక ఆ తర్వాత నాగ చైతన్య 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నభా నటేష్ నటించనప్పటికి నిధి తన అందచందాలతో బాగానే పాపులారిటీ సంపాధించుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం కంటే ముందు నిధి అగ‌ర్వాల్ చాలా చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ, ఈ సినిమాకి వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధికి మంచి ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అందులో భాగంగా నిధి తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. నిధి ఇటీవల జయం రవి హీరోగా వచ్చిన 'భూమి' అనే సినిమాలో నటించి త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమాతో నిధి ఈశ్వరన్ అనే మరో సినిమాలోను నటించింది. ఈ సినిమాలో సింబు ప్రధాన పాత్రలో నటించాడు.

    అది అలా ఉంటే నిధికి తమిళనాడులో ఇటీవల ప్రేమికుల రోజు సందర్బంగా గుడి కట్టి పాలాభిషేకాలు చేశారు కొందరు హార్డ్ కోర్ అభిమానులు. అంతేకాదు ఆమె పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను కూడ నిర్వహించారు. ఇలా తన కోసం ఏకంగా గుడి కట్టి పూజలు చేయడం చూసి నిధి సైతం షాకైంది. ప్రేక్షకుల్ అభిమానానికి పొంగిపోయింది. ఈ నేపథ్యంలో నిథి తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. తన కోసం కట్టిన ఆ గుడిని గూడు లేనివారికి ఆశ్రయంగా ఇవ్వాలని కోరింది. అంతేకాదు అవసరమున్నవారి ఆకలి తీర్చడం, విద్యను అందిచడం వంటి సేవా కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని నిధి ఆ గుడి ట్రస్టీలను కోరింది. తనకు ఇలాంటి అభిమానులు ఉన్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నానాని పేర్కోంది.

    ఇక నిధి తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె అశోక్ గ‌ల్లా హీరోగా పరిచయమవుతోన్న సినిమాలో ఆయన స‌ర‌స‌న హీరోయిన్ న‌టిస్తుంది. ఈ సినిమాకు యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నిధి అగర్వాల్ తెలుగులో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించే ఆఫర్ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న ఓ సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించనుంది.
    Published by:Suresh Rachamalla
    First published: