• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL PRACTICING DANCE AND SHE LOOKS HOT MHN

Nidhhi Agarwal: అందాల విందు అందిస్తూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న నిధి అగర్వాల్

Nidhhi Agarwal: అందాల విందు అందిస్తూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ హాట్ షో (nidhhi agerwal hot photos/instagram)

Nidhhi Agarwal - Dancing Video: నిధి అగర్వాల్ డాన్సింగ్ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందుకు కారణం అందులో నిధి అగర్వాల్ అందాల విందు చేయడమే.

  • Share this:
    మున్నా మైకేల్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకున్న హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌. ఈ అమ్మ‌డుకి బాలీవుడ్‌లో పెద్ద‌గా కలిసి రాక‌పోవ‌డంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నిధి అగ‌ర్వాల్ చేసిన సినిమా స‌వ్య‌సాచి.. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ రెండు సినిమాలు కూడా అమ్మ‌డుకి హిట్ కాలేదు. ఇది ఓర‌కంగా నిధి అగ‌ర్వాల్‌కు ఇబ్బందిగా మారుతున్న స‌మ‌యంలో ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో అదృష్టం క‌లిసొచ్చింది. రామ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌రోసారి నిధి అగ‌ర్వాల్ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం గ‌ల్లా అశోక్ సినిమాతో పాటు.. త‌మిళంలో జ‌యం ర‌వితో భూమి, శింబుతో ఈశ్వ‌ర‌న్ సినిమాల్లో న‌టించింది.

    ఈ అమ్మ‌డు సినిమాల కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో చాలా బిజీ బిజీగా ఉంటోంది. హాట్ ఫొటోల‌తో ఇండ‌స్ట్రీని ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. గ్లామ‌ర్ ప‌రంగా అందాల‌ను ఆర‌బోయడానికి సైతం వెనుకాడ‌ని నిధి అగ‌ర్వాల్‌కు కాస్త అదృష్టం క‌లిసి వ‌స్తే బావుంటుంది. రీసెంట్‌గానూ నిధి అగ‌ర్వాల్ చిన్న డాన్స్ వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అందులో నిధి అగ‌ర్వాల్ అందాలను చూపిస్తూ చేస్తున్న డాన్స్ కుర్ర కారును ఆక‌ట్టుకుంటోంది మ‌రి.



    ఈ సినిమాల రిలీజ్‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న నిధి అగ‌ర్వాల్‌కు ఈ సంక్రాంతి చాలా స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే ఈమె న‌టించిన భూమి, ఈశ్వ‌ర‌న్ సినిమాలు ఈ సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు