లంగావోణిలో నడుమున వరినాట్లతో... పల్లెటూరి అమ్మాయిగా నిధి అగర్వాల్

తాజాగా ఈ పోరీ.. తమిళంలో జయంరవితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

news18-telugu
Updated: November 16, 2019, 11:54 AM IST
లంగావోణిలో నడుమున వరినాట్లతో... పల్లెటూరి అమ్మాయిగా నిధి అగర్వాల్
నిధి అగర్వాల్
  • Share this:
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ సినిమాలో నిధి నటకు మంచి మార్కులే పడ్డాయి. చైతూ సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన .. పెద్దగా ఆ సినిమా ఆడలేదు. దీంతో ఇస్మార్ట్ ఇచ్చిన హిట్‌తో ఫుల్ ఆనందంలో ఉంది ఈ భామ.తాజాగా ఈ పోరీ.. తమిళంలో జయంరవితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ‘భూమి’ అనే పేరుతో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్‌ను తాజాగా నిధి తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. ఇందులో లంగావోణిలో... నడుములో వరినాట్ల బుట్టతో పక్క పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది నిధి. దీంతో నిధి కొత్త లుక్‌ను చూసిన ఆమె అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. సినిమాలో నిధి, జయం రవి లుక్ చూస్తుంటే... పక్కా పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్‌లో వ్యవసాయం, రైతుపై కథనంతో వస్తున్న సినిమాగా అనిపిస్తోంది.



First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com