• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL ENJOYS WITH HER LOVED DOG BOOZO SHARES IT ON INSTA SR

ప్రియమైనవాడితో నిధి అగర్వాల్ ఎంజాయ్.. ముద్దులే ముద్దులు..

ప్రియమైనవాడితో నిధి అగర్వాల్ ఎంజాయ్.. ముద్దులే ముద్దులు..

నిధి అగర్వాల్ Photo : Instagram

కరోనా దెబ్బకు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

  • Share this:
    నిధి అగర్వాల్.. 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం కంటే ముందు నిధి అగ‌ర్వాల్ చాలా చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ, ఈ సినిమాకి వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధికి మంచి ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అందులో భాగంగా భూమి అనే సినిమాతో త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ.  అది అలా ఉంటే కరోనా దెబ్బకు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా కొందరూవంటలు చేస్తుంటే మరికొందరూ ఇల్లు ఊకడం లాంటీవి చేస్తున్నారు. నిధి అగర్వాల్ మాత్రం తన కుక్క పిల్ల బోజోతో ఆడుకుంటోంది. దానికి సంబందించిన కొన్ని ఫోటోలను ఆ భామ తన సోషల్  మీడియాలో పోస్ట్ చేసింది. బోజోకు ఇడ్లీలంటే చాలా ఇష్టమని.. చెబుతూ కరోనా కుక్క పల్లల ద్వారా వ్యాపించదని.. ఈ క్రిటికల్ టైమ్‌లో వాటిని దూరం చేయకండి అటూ కోరింది. ఇక నిధి తెలుగులో అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న హీరోయిన్ న‌టిస్తుంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు