ఒకప్పుడు సూర్య సినిమా వచ్చిందంటే కనీసం గుర్తింపు ఉండేది. సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ అయితే వచ్చేవి. చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టడంలో సూర్య ఎప్పుడూ ముందే ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. గత రెండు మూడు సినిమాల నుంచి కనీసం ఈ హీరో వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియడం లేదు. ఈయన సినిమాలు అంత దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ఇప్పుడు విడుదలైన NGK సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏడాది పాటు వాయిదా పడి పడి విడుదలైంది.

సూర్య ngk కటౌట్
తీరా విడుదలైన తర్వాత కనీసం ఒక్క షో కూడా సరిగ్గా ఆడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్యతో పాటు రకుల్, సాయి పల్లవి లాంటి స్టార్స్ సినిమాలో ఉన్నా కూడా ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు. NGK మూడు రోజుల్లో కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ చిత్ర తెలుగు హక్కులు దాదాపు 9 కోట్లకు వెళ్లాయని తెలుస్తుంది. అంటే నిర్మాతలు ఈ చిత్రంతో నిండా మునిగిపోయినట్లే. తెలుగులోనే కాదు తమిళనాట కూడా NGK చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ అయిపోయింది.