ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?

Rahul and Punarnavi : తెలుగు బిగ్‌బాగ్ 3 షోలో రాహుల్, పునర్వవీని చూసి... వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అంతా భావించారు. అది నిజమవుతోందా?

news18-telugu
Updated: November 19, 2019, 6:57 AM IST
ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?
రాహుల్, పునర్నవి (credit - instagram)
  • Share this:
Rahul and Punarnavi : బిగ్ బాస్ 3 తెలుగు షో జరుగుతున్నంతసేపూ... అందులో కంటెస్టెంట్లైన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ నడిచాయి. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఐతే... వీటిని కొట్టిపారేసిన రాహుల్, పునర్నవీ... తమ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందనీ... బిగ్ బాస్ షో 100 రోజులు జరగడంతో... కంటెస్టెంట్లంతా ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి రావడంతో... సహజంగానే తమ మధ్య స్నేహం ఏర్పడిందని తెలిపారు. అంత క్లారిటీగా చెప్పినా... వాళ్లిద్దర్నీ చూసి... ప్రేక్షకులకు ఎక్కడో ఏదో డౌట్ అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే చాలా మంది అనుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

త్వరలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కలిసి... లవ్ స్టోరీ సినిమాలో నటించబోతున్నట్లు తెలిసింది. వీళ్లిద్దరిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఓ నిర్మాత తెలివైన ప్లాన్ వేశారు. ఓ మంచి లవ్ స్టోరీతో సినిమా తియ్యాలనీ, అందులో వీళ్లనే హీరో, హీరోయిన్లుగా పెట్టుకోవాలని డిసైడయ్యారు. దీనికి వాళ్లిద్దరూ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఐతే... ఇందుకు సంబంధించిన వివరాల్ని మాత్రం సీక్రెట్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ వర్గాల టాక్.ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్... ఓ కాన్సర్ట్ చేసే పనిలో బిజీ అయ్యాడు. తనను గెలిపించిన అభిమానుల కోసం కాన్సర్ట్ చేస్తానని మాటిచ్చిన రాహుల్... అందుకు సంబంధించిన షో, సెట్టింగ్స్ ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నా్డు. 
View this post on Instagram
 

Only manaki teenmaar okati vachhuu 🕺🏻🕺🏻🕺🏻🕺🏻Khali oopude 😀


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

బుల్లితెరపై, వెండితెరపై ఎంతో మంది నటీనటులు... జంటగా నటించి... రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. మరి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవీ భూపాలం కూడా అలాగే చేస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం.

 

Pics : పాప్ డాన్సర్ యేనా ఇజోన్ అందమే అందం

ఇవి కూడా చదవండి :

బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?

సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి

గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?
Published by: Krishna Kumar N
First published: November 19, 2019, 6:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading