శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్.. దొంగ సంతకాలతో..

Shyam K Naidu: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడుపై కొన్ని రోజుల కింద నటి సాయి సుధ తనను మోసం చేసాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 29, 2020, 10:52 PM IST
శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్.. దొంగ సంతకాలతో..
సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు అరెస్ట్ (shyam k naidu sai sudha)
  • Share this:
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడుపై కొన్ని రోజుల కింద నటి సాయి సుధ తనను మోసం చేసాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. అందులో ఎంత దూరం అయినా వెళ్తానంటూ ఆమె సవాల్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. శారీరకంగా కూడా వాడుకున్నాడని ఆమె ఆరోఫించింది. శ్యామ్ కే నాయుడుపై ఆమె చేసిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ అయిన రెండు రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చేశాడు శ్యామ్. ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో ఒకటికి రెండు అన్నట్లు మరో కేసు కూడా శ్యామ్‌పై నమోదైంది.
సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు అరెస్ట్ (shyam k naidu sai sudha)
సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు అరెస్ట్ (shyam k naidu sai sudha)

తాను నటి సాయిసుధాతో కాంప్రమైజ్ అయినట్లుగా కోర్టులో శ్యామ్ కే నాయుడు పిటిషన్ వేయడంతో.. నిజంగానే ఆమె కాంప్రమైజ్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ అసలు సీన్ అంతా ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ విషయంలో సాయిసుధ మరో సంచలన నిజం బయట పెట్టింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె కోర్టుకు తెలిపింది. దాంతో శ్యామ్ కే నాయుడు బెయిల్‌ను నాంపల్లి కోర్టు రద్దు చేయడమే కాకుండా అతడిపై ఫోర్జరీ కేసు కూడా నమోదైంది.
First published: June 29, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading