HOME »NEWS »MOVIE »new tv show rudramadevi serial start from today in star maa mnj

Rudramadevi: బుల్లితెర‌పై వీర‌నారి 'రుద్ర‌మ‌దేవి' ధారావాహిక.. ఇవాళ్టి నుంచే ప్రసారం

Rudramadevi: బుల్లితెర‌పై వీర‌నారి 'రుద్ర‌మ‌దేవి' ధారావాహిక.. ఇవాళ్టి నుంచే ప్రసారం
రుద్రమదేవి (You Tube)

బుల్లితెర‌పై మ‌రో వీర‌నారి ధారా వాహిక వెలువ‌డ‌నుంది. బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం కాక‌తీయ సామ్రాజ్యాన్ని ప‌రిపాలించిన రాణి రుద్ర‌మ‌దేవి(Rudramadevi) జీవిత క‌థను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా తీసుకురానుంది. ఇవాళ్టి నుంచే ఈ సీరియ‌ల్ ప్రారంభం కాబోతోంది.

  • Share this:
    Rudramadevi: బుల్లితెర‌పై మ‌రో వీర‌నారి ధారా వాహిక వెలువ‌డ‌నుంది. బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం కాక‌తీయ సామ్రాజ్యాన్ని ప‌రిపాలించిన రాణి రుద్ర‌మ‌దేవి జీవిత క‌థను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా తీసుకురానుంది. ఇవాళ్టి నుంచే ఈ సీరియ‌ల్ ప్రారంభం కాబోతోంది. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రుద్ర‌మ‌దేవి ప్ర‌సారం కానుంది. ఇందులో రాణి రుద్ర‌మ‌దేవి జ‌న‌నం మొద‌లు పెర‌గ‌డం, యుద్ధ క‌ల‌లో ప‌ట్టు సాధించ‌డం, రాజ్య ప‌రిపాల‌న ఇలా అన్ని అంశాల‌ను చూపించ‌నున్నారు. భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతో ఈ సీరియ‌ల్ బుల్లితెర వీక్ష‌కుల కోసం రానుంది. ఇదివ‌ర‌కు ఆ స‌మ‌యంలో క‌స్తూరి ప్ర‌సారం కానుండ‌గా.. ఇప్పుడు ఆ స్థానంలో రుద్ర‌మ‌దేవి రానుంది.

    కాగా రుద్ర‌మ‌దేవి జీవిత క‌థ ఆధారంగా ఇప్ప‌టికే వెండితెర‌పై సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ చిత్రంలో రానా, అల్లు అర్జున్, నిత్యా మీన‌న్, కేథ‌రిన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. 2015లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు రుద్ర‌మ‌దేవి జీవిత క‌థ బుల్లితెర‌పై కూడా ప్ర‌ద‌ర్శితం కానుంది.



    అయితే ఇప్ప‌టికే స్టార్ మాలో వ‌చ్చే సీరియ‌ల్స్ మంచి రేటింగ్‌ను సంపాదిస్తున్నాయి. ఇందులో వ‌స్తోన్న కార్తీక దీపం సీరియ‌ల్ కొన్ని నెల‌లుగా రేటింగ్‌లో టాప్ 1లో కొన‌సాగుతోంది. అలాగే గృహ‌ల‌క్ష్మి, వ‌దిన‌మ్మ సీరియ‌ళ్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక ఇప్పుడు రుద్ర‌మ‌దేవి సీరియ‌ల్ కూడా స్టార్ మాకు మ‌రింత రేటింగ్‌ని తీసుకురానుందేమో చూడాలి.
    Published by:Manjula S
    First published:January 18, 2021, 18:17 IST