సాహో దెబ్బ... ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్ ?

ప్రభాస్ ఫైల్ ఫోటో twitter.com/PrabhasRaju

సాహో తరువాత తెరకెక్కబోతున్న కొత్త సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్ మొదలైందని టాక్ వినిపిస్తోంది.

 • Share this:
  భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీ ఆడియెన్స్‌ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాహుబలి తరువాత ప్రభాస్ మూవీ రిజల్ట్ ఈ రకంగా ఉంటుందని చాలామంది ఊహించలేకపోయారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఇమేజ్ మరో లెవల్‌కు వెళుతుందని సినీజనం లెక్కలు వేసుకున్నారు. అయితే సాహో మూవీ వారి అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. సాహో ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్లపై ఏ రేంజ్‌లో ఉంటుందనే దానిపై ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటుంటే... ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  బాహుబలి తరువాత తాను నటించబోయే సినిమా బాధ్యతలను అంతగా అనుభవం లేని యంగ్ డైరెక్టర్ సుజిత్ చేతిలో పెట్టిన ప్రభాస్... ఎవరేం అనుకున్నా అతడిపై ఎంతో నమ్మకం ఉంచాడు. అయితే భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడంలో సుజిత్ ఫెయిలయ్యాడని సినిమా చూసి వారి నుంచి వినిపిస్తున్న మాట. సుజిత్ సంగతి ఇలా ఉంటే ప్రభాస్ నెక్ట్స్ మూవీని తెరకెక్కించబోయేది కూడా అంతగా అనుభవం లేని కుర్ర దర్శకుడే కావడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న మరో అంశం.

  గోపీచంద్‌తో జిల్ అనే ఫ్లాప్‌ను అందుకున్న రాధాకృష్ణకు తనతో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. అంతకుముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం మాత్రమే ఉన్న రాధాకృష్ణ... ప్రభాస్ కొత్త సినిమాను ఏ రకంగా డీల్ చేస్తాడో అనే టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో మొదలైంది.

  ఇప్పటికే బాహుబలితో పెరిగిన ప్రభాస్ ఇమేజ్‌ సాహో కారణంగా కొంత తగ్గిందనే ఆందోళన ప్రభాస్ ఫ్యాన్స్‌లో కనిపిస్తుంది. అందుకే తమ ఫేవరెట్ హీరో తదుపరి మూవీని దర్శకుడు రాధాకృష్ణ ఏ రకంగా తెరకెక్కిస్తున్నాడనే అంశంపై ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి ఓ అప్ కమింగ్ డైరెక్టర్‌పై నమ్మకం ఉంచి ఫెయిలైన ప్రభాస్... మరో అప్ కమింగ్ డైరెక్టర్‌తో చేస్తున్న సినిమాపై ప్రత్యేకమైన దృష్టి పెడతాడేమో చూడాలి.
  First published: