Home /News /movies /

NEW SONG FOR SARKARU VAARI PAATA FROM TOMORROW HERE ARE THE DETAILS SR

Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే ట్రీట్..

Sarkaru Vaari paata Twitter

Sarkaru Vaari paata Twitter

Sarkaru Vaari Paata : మూడవ వారంలోకి అడుగు పెట్టిన సర్కారు వారి పాట నుంచి ఓ అదిరిపోయే ట్రీట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో సెన్సేషన్ సాంగ్ మురారి బావ అనే పాటను రేపటి నుంచి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తమన్ తాజాగా ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
    Mahesh Babu | Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అది అలా ఉంటే మూడవ వారంలోకి అడుగు పెట్టిన సర్కారు వారి పాట నుంచి ఓ అదిరిపోయే ట్రీట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో సెన్సేషన్ సాంగ్ మురారి బావ అనే పాటను రేపటి నుంచి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తమన్ తాజాగా ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.

    ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. సర్కారు వారి పాట 15 వ రోజు మంచి కలెక్షన్స్‌నే వసూలు చేసింది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో 15వ రోజు 26 లక్షల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్‌గా 35 లక్షల షేర్ ని అందుకుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఇప్పటి వరకు 107.01 కోట్ల షేర్‌ను 172.00 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా, బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 13.99 కోట్లను వసూలు చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎంత మాత్రం వసూలు చేయనుందో.. అయితే ఇక్కడ విషయం ఏమంటే.. ఇప్పటికే ఎఫ్ 3 వచ్చింది. ఇక ఆ తర్వాత మేజర్, విక్రమ్ అంటూ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.


    ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ జూన్ 10న లేదా జూన్ 24న సినిమాను స్ట్రీమింగ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి.

    Sarkaru Vaari Paata break-even, Mahesh Sarkaru Vari Pata OTT Release Date Locked, Mahesh Babu, Sarkaru Vaari Paata Ott, Amazon Prime Video, Sarkaru Vaari Paat Streaming, సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ డేట్ లాక్, Sarkaru Vaari Paata pre release business, Sarkaru Vaari Paata songs, Sarkaru Vaari Paata promotions, Sarkaru Vaari Paata mass song promo Ma Ma Mahesha, Sarkaru Vaari Paata censor, Sarkaru Vaari Paata review, Sarkaru Vaari Paata songs, mahesh babu news, Mahesh, Keerthy suresh news, Keerthy suresh pics, మహేష్ బాబు, పరుశురామ్, కీర్తి సురేష్,సర్కారు వారి పాట రిలీజ్ డేట్, మహేష్ బాబు మూవీస్, సర్కారు వారి పాట కలెక్షన్స్
    Sarkaru Vaari paata Twitter


    ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది.ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు