Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అభిమానులుగా మారారు. ఇక ప్రస్తుతం మోనిత ఏమైంది.. అసలు ఆమెను ఎవరు చంపారు అనే దానిపై నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక కార్తీక్ దగ్గరికి దీప వచ్చిన సంగతి తెలిసిందే. దీపను చూసి కార్తీక్ బాధగా మాట్లాడుతుంటాడు. నీకు అన్ని కష్టాలు ఇచ్చాను అంటూ.. ఇక నాకోసం ఏడవకు అంటూ తనను ఓదారుస్తాడు. ఇకపై పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని మాట్లాడటంతో ఆ మాటలు అన్నీ విన్న దీప బాధపడుతూ అప్పగింతలు అయిపోయాయా అని అంటుంది. అలా దీప, కార్తీక్ మాట్లాడుతుండగా రోషిణి వచ్చి దీపను పిలుస్తుంది. మరోవైపు ఆనందరావు కార్తీక్ గురించి సౌందర్య తో మాట్లాడుతూ బాధపడతాడు. గతంలో కార్తీక్ ను తను హాస్పిటల్ లో వెళ్లగొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సౌందర్యతో మాట్లాడతాడు. నా వల్లే ఏదో జరిగిందని గిల్టీగా ఉందని అనడంతో సౌందర్య.. తండ్రిగా మీకు శిక్షించే అర్హత ఉంటుందని అంటుంది.
ఇక రోషిణి దీపతో మాట్లాడుతుంది. ప్రియమణి ఎంక్వయిరీ చేశాను అనడంతో దీప కూడా నేను కూడా నా భర్త ని ఎంక్వైరీ చేశాను అంటుంది. అలా వారిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతోంది. నీ వాదనలన్నీ కోర్టులోనే వినిపించుకో అని అంటుంది రోషిణి. నా భర్త ఏంటో నాకు తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని అంటుంది. రోషిణి మాత్రం కార్తికే చేశాడు కావాలంటే సాక్షాలు కూడా ఉన్నాయని అంటుంది.
ఇక రోషిణి.. మోనితని శవాన్ని మీ ఆయన ఎక్కడ దాచాడో చెప్పమని చాలు.. అతడికి పడే శిక్ష తగ్గేలా చేస్తాను. అప్పుడు నువ్వు నీ పిల్లలు నీ భర్తతో సంతోషంగా ఉంటారు.. ఇదే నేను చేసే సహాయం ఉంటుంది. ఇక మరోవైపు ఆదిత్య, ఆనంద్ రావు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి బాధపడతారు. హాస్పిటల్ లో కార్తీక్ గురించి నీచంగా మాట్లాడారని అన్నారన్న విషయాన్ని చెబుతూ బాధపడతాడు. ఆ మాటలు విన్న దీప నా భర్త తప్పు చేయలేదు నా భర్తను నేను రక్షించుకుంటానని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
జైల్లో ఉన్న కార్తీక్ దగ్గరకు రత్న సీత వచ్చి తన భర్తకు గుండె బరువుగా ఉంది అని సహాయం కోరుకుంటుంది. ఏదైనా మందులు రాసివ్వమని డాక్టర్ బాబు ని కోరుతుంది. వెంటనే మందులు రాసి ఇవ్వగా.. సీత కార్తీక్ కు భోజనం ఇస్తుంది. ఇక కార్తీక్ చూసి రత్న సీత నాకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు.. నాపై ఎందుకు జాలి చూపిస్తున్నావు అనడంతో మీరు మంచి వ్యక్తి అని బయట మీ గురించి విన్నానని అంటుంది రత్న సీత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika Deepam serial, Nirupam paritala, Telugu daily serial, Vantalakka