#Maheshbabu: అభిమానులకు మహేష్ బాబు దసరా స్పెషల్ ట్రీట్..

ఈ దసరా పండగ రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు..తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 6, 2019, 7:35 PM IST
#Maheshbabu: అభిమానులకు మహేష్ బాబు దసరా స్పెషల్ ట్రీట్..
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
news18-telugu
Updated: October 6, 2019, 7:35 PM IST
ఈ దసరా పండగ రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు..తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఉగ్రవాదులను ఏరివేసే  మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు  ఈ చిత్రంలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా దసరా కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5.04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Loading...
ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్. ఇక్కడ కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను  తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...