హోమ్ /వార్తలు /సినిమా /

జయలలితపై మరో సినిమా..ఈసారి విద్యాబాలన్‌

జయలలితపై మరో సినిమా..ఈసారి విద్యాబాలన్‌

విద్యాబాలన్‌/ Twitter

విద్యాబాలన్‌/ Twitter

దివంగత నటీ, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. దీంతో జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య మూడుకి చేరింది.

  దివంగత నటీ, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. దీంతో జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య మూడుకి చేరింది. జయలలితపై 'ఐరన్ లేడి'  అనే సినిమా చాలా రోజుల కిందనే ప్రకటించారు. ఈ సినిమాలో నిత్యామేనన్‌ జయలలిత పాత్ర పోషిస్తుండగా... ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాతో  పాటు జయలలిత జీవితగాధ ఆధారంగా మరో సినిమా భారతిరాజా దర్శకత్వంలో వస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇప్పుడు తాజాగా ఏఎల్‌ విజయ్‌ మరో చిత్రాన్ని జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తైనట్టు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జయలలిత పాత్రలో విద్యాబాలన్‌ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు మరో ముఖ్య  పాత్రకు అరవింద్‌స్వామిని తీసుకున్నారని తెలుస్తోంది.

  ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను జయలలిత పుట్టినరోజైనా ఫిబ్రవరి 24 న తెలుపనున్నారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు‘అమ్మా ఎండ్రాల్‌ అన్బు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్కు పూర్తవడంతో.. ఈ ఏడాదిలోపు చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే సంవత్సరం 2020 ఫిబ్రవరి 24 జయలలిత పుట్టినరోజున  సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Kollywood, Kollywood News, Tamil Cinema, Tamil Film News

  ఉత్తమ కథలు