Home /News /movies /

RRR - Raja Mouli: రాజమౌళికి కొత్త తలనొప్పి..RRR..లీగల్ సమస్యలు?

RRR - Raja Mouli: రాజమౌళికి కొత్త తలనొప్పి..RRR..లీగల్ సమస్యలు?

New headache to Rajamouli legal issues for RRR overseas rights

New headache to Rajamouli legal issues for RRR overseas rights

RRR - Raja Mouli: RRR ఓవర్‌సీస్‌ హక్కుల విషయంలో నిర్మాతలకు, జక్కన్న అండ్‌ టీమ్‌కు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి

    ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీస్ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)’ ఒకటి. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్ర‌కారం ప్రీ రిలీజ్ బిజినెస్ కేక పెట్టిస్తుంది. కేవ‌లం థియేట్రిక‌ల్ బిజినెస్ వ‌ర‌కే ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను దాటించాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇంత క్రేజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయట. అదేంటంటే.. ఓవర్‌సీస్‌ హక్కుల విషయం. వివరాల్లోకి వెళితే ఓవర్‌ సీస్‌ బయ్యర్‌కు, యు.ఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు మధ్య ఓవర్‌ సీస్‌ రేట్స్‌ పరంగా గొడవలు నెలకొన్నాయంట. ఈ గొడవలు లీగల్‌ సమస్యలకు దారి తీస్తుందని కూడా టాక్‌ బలంగా వినిపిస్తోంది.

    అయితే ప్రస్తుతం క్లైమాక్స్‌ను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఎలాగైనా విడుదల చేయాలని అనుకుంటున్న రాజమౌళి అండ్‌ టీమ్‌.. ఈ సమస్యను పెద్దది కానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. బాహుబలి వంటి సెన్సేషనల్‌ పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్‌ భీమ్‌, భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్స్‌ సహా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్‌ వస్తుంది.

    ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడి, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Jr ntr, Ram Charan, Rrr movie, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు