HOME »NEWS »MOVIE »new headache for koratala siva to make aacharya comedy track mhn

Chiranjeevi - Koratala: ‘ఆచార్య’ విష‌యంలో కొర‌టాల‌కు కొత్త త‌ల‌నొప్పి..!

Chiranjeevi - Koratala: ‘ఆచార్య’ విష‌యంలో కొర‌టాల‌కు కొత్త త‌ల‌నొప్పి..!
New headache for Koratala Siva to make Aacharya comedy track

Chiranjeevi - Koratala: చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవితో ఏ ముహూర్తాన ‘ఆచార్య’ ను మొద‌లు పెట్టాడో కానీ కొర‌టాల శివ‌కు అంత ఈజీగా మాత్రం తెగ‌డం లేదు. ఏదో ఒక స‌మ‌స్య వ‌చ్చిప‌డుతూనే ఉంది. అనుకున్న‌ప్ప‌టి కంటే చాలా ఆల‌స్యంగా సెట్స్ పైకి వెళ్లిన ‘ఆచార్య’ షూటింగ్ స‌మ‌యంలో కోవిడ్ రావ‌డంతో ఆగింది. ఆరేడు నెల‌లు త‌ర్వాత నెమ్మ‌దిగా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఇక స్పీడు మీద చేసుకుంటూ వెళ్లిపోతున్న స‌మయంలో అనుకోని కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చింది. అందేంటంటే కామెడీ ట్రాక్‌. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల శివ తెర‌కెక్కించిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భ‌ర‌త్ అనేనేను చిత్రాల్లో కామెడీ ట్రాక్ ఉంటుంది కానీ.. దాని రేంజ్ ఒక‌లా ఉంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్న ఆచార్య విష‌యానికి వ‌స్తే చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

    దీంతో చిరంజీవి ‘ఆచార్య’ కోసం ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పించేలా ప‌ర్‌ఫెక్ట్ కామెడీ ట్రాక్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట కొర‌టాల‌. ముందు చేసిన కామెడీ ట్రాక్ నచ్చ‌క‌పోవ‌డంతో .. కొత్త‌గా శ్రీధ‌ర్ సీపానతో కామెడీ ట్రాక్ త‌యారు చేయించాడ‌ట‌. త‌ను త‌యారుచేసిన కామెడీ ట్రాక్ న‌చ్చ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రో రైట‌ర్‌ను కొర‌టాల శివ లైన్‌లో పెట్టాడ‌ట‌. ఆ రైట‌రే బీవీఎస్ ర‌వి. ఇప్పుడు ఈ కామెడీ ట్రాక్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియ‌డం లేదు.



    హైద‌రాబాద్ కోకాపేట‌లో వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్‌లో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ ఇందులో న‌క్స‌లైట్ నాయ‌కుడి పాత్ర‌లో కనిపించ‌నున్నారు. దేవాదాయ శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా సినిమా ఉంటుంది. సోనూసూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
    Published by:Anil
    First published:January 13, 2021, 11:46 IST

    टॉप स्टोरीज