మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి, ఉత్కంఠ మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుంటే... మరోవైపు సినిమాను వివాదాలు కూడా వదలేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సినిమాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. సినిమాపై మరో కొత్త వివాదం మొదలైంది. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన క్లియరెన్స్‌ను నిలిపివేయాలంలూ వడ్డెర కులస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నర్సింహారెడ్డి ప్రధాన అనుచరుడైన వడ్డెర ఒబన్న పాత్రను వక్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు.
ఒబన్న పాత్రను రాజు పాండే అనే మరో పాత్రతో భర్తీ చేశారని... అసలు అలాంటి పాత్ర ఏదీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో లేదని పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు లేని పాత్రను సృష్టించి... చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. సినిమాను ఆపకపోతే విడుదలైన రోజే థియేటర్లలో సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా... సైరా సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.