సుచీ లీక్స్ సుచిత్రకు ఏమైంది... మిస్సింగ్ కేసు

సుచిత్ర కనిపించడం లేదంటూ ఆమె సోదరి సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.

news18-telugu
Updated: November 14, 2019, 7:49 PM IST
సుచీ లీక్స్ సుచిత్రకు ఏమైంది... మిస్సింగ్ కేసు
సింగర్ సుచిత్ర(ఫైల్ ఫోటో)
  • Share this:
సింగర్ సుచిత్ర మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘సుచీ లీక్స్‌’తో కోలీవుడ్‌లో దుమారం రేపిన సింగర్‌ సుచిత్ర... సొంతవాళ్లే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే తనను క్లినిక్‌లో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుచిత్ర కనిపించడం లేదంటూ ఆమె సోదరి సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. తన తల్లి ఇంటి నుంచి తన నివాసానికి వచ్చే క్రమంలో ఆమె మిస్సయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుచిత్ర మానసిక వైకల్యంతో బాధపడుతోందని.. అందుకే త్వరగా తన జాడను కనిపెట్టాలని పోలీసులను కోరారు.

ఈ క్రమంలో పోలీసులు సుచిత్ర ఓ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చినందు వల్లే సుచిత్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని.. ప్రస్తుతం ఆమెను తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అంశంపై సుచిత్ర స్పందించినట్టు తెలుస్తోంది. తాను మిస్సవ్వలేదని... కొన్ని గంటలపాటు వారితో కాంటాక్ట్‌లో లేనందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడేమో నాకు పిచ్చి పట్టిందన్నట్లుగా ఓ క్లినిక్‌లో చేర్పించారని అన్నారు. కోలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలను సుచీ లీక్స్‌ పేరిట 2017లో సుచిత్ర తన ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.


First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు