Hyper Aadi: యాంకర్ వర్షిణికి బిగ్ షాక్.. హైపర్ ఆది ప్లాన్.. కొత్త అమ్మాయితో రొమాన్స్ ?

హైపర్ ఆది, వర్షిణి

Dhee Champions: సాధారణంగానే ఢీ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా ఇవి కామన్. ఈ క్రమంలోనే వర్షిణిని కూడా మార్చి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    కొన్ని బుల్లితెర కార్యక్రమాలు చాలా పాపులర్. అలాంటి కార్యక్రమాల్లో ఢీ జోడి కూడా ఒకటి. ఆకట్టుకునే డాన్స్‌లతో పాటు జబర్ధస్త్ నటులు సుధీర్, హైపర్ ఆది, రష్మీ, వర్షిణి వంటి వాళ్ల కామెడీ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ. అటు కామెడీ, ఇటు డాన్స్‌తో ఈ షో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఢీ కొత్త సీజన్ ప్రోమోలో హైపర్ ఆది పక్కన వర్షిణీ కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఢీ ఛాంపియన్స్ ముగియడంతో కొత్త సీజన్‌కు ఢీ క్వీన్స్, కింగ్స్ అని పేరు పెట్టారు. ఈ సారి జంటలు కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేకంగా ఉన్నారు. ఇందులో సుధీర్, ఆది ఓ వైపు ఉంటే.. మరో మెంటర్స్‌గా రష్మి గౌతమ్, దీపిక పిల్లై ఉండటం విశేషం. వర్షిణీ స్థానంలో టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన దీపికను తీసుకురావడం గమనార్హం. దీంతో వర్షిణిని తప్పించారా ? లేక ఆమెను మళ్లీ తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ వర్షిణి నిజంగానే ఈ షోలో లేకపోతే.. ఆది, వర్షిణి మధ్య కెమిస్ట్రీని ఆడియెన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

    సాధారణంగానే ఢీ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా ఇవి కామన్. ఈ క్రమంలోనే వర్షిణిని కూడా మార్చి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే సుధీర్, రష్మీ రేంజ్‌లో వర్షిణితో తన జంట పాపులర్ కావడం లేదనే కారణంగా హైపర్ ఆది ఆమెను తప్పించి దీపికకు ఛాన్స్ ఇప్పించారనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజానికి ఢీ షోలో ఆది, వర్షిణి మధ్య కూడా ఏదో జరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ షో ద్వారా వారి మధ్య రొమాన్స్ బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే సుధీర్, రష్మీ జంట ముందు ఈ జంట అంతగా పాపులర్ కాలేకపోతోందన్నది మరో టాక్. ఈ కారణంగానే వర్షిణిని పక్కనపెట్టి ఆది మరో కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి జబర్ధస్త్‌లోనూ హైపర్ ఆది అనేక మంది అమ్మాయిలకు తన స్కిట్‌లో ఛాన్స్ ఇస్తుంటాడు. అలాగే ఢీ కొత్త ప్రొగ్రామ్‌లోనూ వర్షిణికి హ్యాండ్ ఇచ్చాడేమో అనే గుసగుసలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: