కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో.. పవన్ తేజ్..

కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో వస్తున్నాడు.

news18-telugu
Updated: January 12, 2020, 9:48 AM IST
కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో.. పవన్ తేజ్..
Twitter
  • Share this:
కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో వస్తున్నాడు. రామ్ చరణ్‌కు తమ్ముడు వరుస అయ్యే ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. కొత్త డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందించ‌బోతున్నారు. ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పెట్టింది చిత్రబృందం. హీరోయిన్‌గా మేఘన చేస్తోంది. ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్ వస్తున్నాడు కాబట్టి ఈ కొత్త హీరో పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే దగ్గరయ్యే అవకాశం ఉంది. ‘పవన్ తేజ్’ ఇంతకుముందు చిరంజీవి ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి సినిమాకు కావాల్సిన మెళకువలు నేర్చుకున్నాడు. ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ‌కూడా విడుదలైంది. కొణిదెల బ్రాండ్‌తో వస్తున్న ఈ కొత్త హీరో తన నటన, డాన్స్ తో మరి ఏమాత్రం తెలుగువారిని ఆకట్టుకుంటాడో చూడాలి.


అదిరిపోయే ఫిగర్‌తో కవ్విస్తోన్న నివేథా పేతురాజ్...

Published by: Suresh Rachamalla
First published: January 12, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading