చిరంజీవి నుంచి అదే నేర్చుకున్నా.. సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు

సైరా మూవీలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు నటించారు. అవుకు రాజు పాత్రలో సుదీప్ కనిపించబోతున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 6:56 PM IST
చిరంజీవి నుంచి అదే నేర్చుకున్నా.. సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు
చిరంజీవి, సుదీప్
news18-telugu
Updated: September 18, 2019, 6:56 PM IST
రక్తచరిత్రతో టాలీవుడ్‌కు పరిచయమైన కిచ్చా సుదీప్.. ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బాహుబలిలోనూ మెరిసి అందరి నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవలే పహిల్వాన్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. త్వరలో విడుదల కానున్న చిరంజీవి మూవీ సైరాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు సుదీప్. ఐతే పహిల్వాన్ మూవీ ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవిని చూసి నేర్చుకున్నట్లు సుదీప్ తెలిపారు.

సైరా మూవీలో చిరంజీవితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లకూడదని చిరంజీవిని చూసి నేర్చుకున్నా. రాజకీయాలు ఆయన పదేళ్ల సినీ జీవితాన్ని నాశనం చేశాయి. అందుకే నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను.
సుదీప్


సైరా మూవీలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు నటించారు. అవుకు రాజు పాత్రలో సుదీప్ కనిపించబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన మూవీపై శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...