హోమ్ /వార్తలు /సినిమా /

Nayanthara | Netrikann Trailer : ఉత్కంఠభరితంగా నయనతార నెట్రికన్.. ఛాలెంజింగ్ రోల్‌లో లేడీ సూపర్ స్టార్..

Nayanthara | Netrikann Trailer : ఉత్కంఠభరితంగా నయనతార నెట్రికన్.. ఛాలెంజింగ్ రోల్‌లో లేడీ సూపర్ స్టార్..

Netrikann Official Trailer released Photo : Twitter

Netrikann Official Trailer released Photo : Twitter

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. తెలుగులో మూడో కన్ను పేరుతో విడుదలకానుంది.

  Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. తెలుగులో మూడో కన్ను పేరుతో విడుదలకానుంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. ఆగస్టు 13న ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఇంటెన్సివ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. నయనతార అంధురాలిగా అదరగొట్టింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నెటిజన్స్‌ను బాగానే ఆకర్షిస్తోంది. నెట్రికన్ సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మిస్తోండగా.. మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార గతంలో కూడా ఇలాంటీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి అదరగొట్టింది నయన్. ఇక నెట్రికన్ విషయానికి వస్తే.. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా వస్తోంది.

  ఇక నయనతార నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తేలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో అన్నయ్యగా దీపావళికి వస్తోంది. దీంతో పాటు కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది నయన్. సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు.  మరోవైపు నయన ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని తాజా సమాచారం.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Nayanthara, Tollywood news

  ఉత్తమ కథలు