హీరో మంచు విష్ణు(Manchu Vishnu) గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇక తనకు సంబంధించిన చాలా విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే విష్షు చేసిన చాలా పోస్టులకు నెటిజన్స్ కొందరు ఆయనను ట్రోల్ చేస్తుంటారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ (MAA)ప్రెసిడెంట్‌గా అయిన తర్వాత... ఈ ట్రోలింగ్స్, కామెంట్లు మరి కొంచెం ఎక్కువయ్యాయి. ఆయన ఏం చేసినా.. కూడా కొందరు నెటిజన్లు ఆయనపై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా మంచు విష్ణు చేసిన పోస్టుపై కొందరు ఆయనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మంచు విష్ణు, జెనీలియా(Genelia) కలిసి .. 2007లో ఢీ (Dhee Movie)సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. శ్రీహరి, బ్రహ్మానందం,సునీల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీను వైట్ల దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ(Chakri) ఢీ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు కూడా అప్పట్లో మంచి హిట్ సాధించాయి.
అయితే తాజాగా జెనీలియా, మంచు విష్ణు కలిశారు. తాము నటించిన 'ఢీ' సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ అదే స్టైల్లో ఫొటోకి పోజిచ్చారు మంచు విష్ణు- జెనీలియా. ఈ పిక్‌ను అభిమానులతో పంచుకుంటూ 'మా అనుబంధంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని' విష్ణు పేర్కొన్నారు. దీనికి జెనీలియా కూడా రిప్లై ఇచ్చింది. ‘అవును నిజం.. నిన్ను కలిసినప్పుడల్లా గ్రేట్ ఫన్ ఉంటుంది. 2007 తిరిగి వచ్చేసినట్లు అనిపిస్తుంది’ అంటూ జెనీలియా కూడా స్పందించింది. ఇప్పుడు ఇదే ట్వీట్ పై కొందరు అభిమానులు ఘాటైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. మా బిల్డింగ్ పెడతా అని ..అమ్మాయిలతో ఫోటోలు పెడుతున్నావా అంటూ ఓ నెటిజన్ మంచు విష్ణు ట్వీట్ పై స్పందించాడు.
My Tinker bell and me. Nothing has changed since we met @geneliad ❤️
Powerful Bond, forever 💪 pic.twitter.com/62gTYC4JlG
— Vishnu Manchu (@iVishnuManchu) May 22, 2022
మరొకరు అన్నా మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్క సొంత డబ్బా కొట్టుడేనా..లేక టాలీవుడ్‌ను హాలివుడ్ రేంజ్‌కు తీసుకెళ్లేది ఏమైనా ఉందా ?నువ్వ పెసరట్టువా అన్నా మా అసోసియేషన్‌కు మరిచిపోయినావా ఏంది ? అంటూ మరో నెటిజన్ వ్యగ్యంగా స్పందించారు. మా బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ‘నిజమే అన్నా, మానసికంగా కూడా ఎదగలేదు మీ ఇద్దరూ. ఇప్పటికీ అలానే ఉన్నారు’ అంటూ మరో నెటిజన్ అన్నాడు. ఇక జెనీలియా బాగానే ఉంది... నువ్వే ఫేడ్ అవుట్ అయ్యావు అని మరొకరు పోస్టు చేశారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు.. మంచు విష్ణు చేసిన పోస్టుపై కామెంట్లు పెట్టేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Genelia, Genelia D'Souza, MAA, Manchu Vishnu