పునర్నవిని తిట్టిపోస్తున్న రాహుల్ ఫ్యాన్స్

అసభ్యకరంగా మెసెజ్‌లు పెడుతున్నారని పాపం పునర్నవి బాధపడుతూ రాహుల్‌కు కూడా చెప్పింది.

news18-telugu
Updated: November 24, 2019, 3:43 PM IST
పునర్నవిని తిట్టిపోస్తున్న రాహుల్ ఫ్యాన్స్
రాహుల్ పునర్నవి Instagram/sipligunjrahul
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వీళ్ల మధ్య ఏర్పడిన రిలేషన్‌ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక బిగ్ బాస్ షో ముగిశాక ఇద్దరూ బిజీ బిజీగా అనేక టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ మీడియా చానెళ్లలో ప్రసారం అయిన ప్రోమో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. నా వల్ల, శ్రీముఖి వల్ల టైటిల్ గెలిచివా? అవకాశా వాదివా.. అంటూ రాహుల్‌ను పునర్నవిని ప్రశ్నించినట్టుగా ఉన్న ఆ ప్రోమోను ఇప్పుడు పునర్నవికి లేనిపోని తలనొప్పిగా మారింది. ఈ ప్రోమోను చూసినరాహుల్ ఫ్యాన్స్ పునర్నవిని ఆడేసుకున్నారు. తమ చిచ్చాను కించపరిచిందంటూ రాహుల్ ఫ్యాన్స్ పునర్నవిని తిట్టిపోసుకుంటున్నారు. వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తూ.. అసభ్యకరంగా మెసెజ్‌లు పెడుతున్నారని పాపం పునర్నవి వాపోయిందట. ఇదే విషయాన్ని రాహుల్‌కు కూడా చెప్పిందంట.

దీంతో ఇద్దరూ కలిసి లైవ్‌లోని వచ్చి ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. పునర్నవిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన తన చిచ్చాలకు రాహుల్ రిక్వెస్ట్ చేశాడు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఇంటర్వ్యూలో ఇద్దరం కలిసి పాల్గొన్నామన్నాడు. ఎప్పటిలాగే అక్కడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నామన్నారు. ఛానల్ టీఆర్పీ కోసం ప్రోమోను అలా కట్ చేశారని, దాన్ని పట్టుకుని అందరూ పునర్నవి తిట్టడం సరికాదని చెప్పుకొచ్చాడు. పునర్నవిని టార్గెట్ చేయకండని తన చిచ్చాలను కోరాడు. వేరే వారి ఫ్యాన్స్ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారని, అలా చేయవద్దంటూ తన అభిమానులకు రాహుల్ చెప్పాడు.

First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>