Home /News /movies /

NETIZENS TROLLS ON BIGG BOSS SEASON 5 TELUGU CONTESTANTS ENGLISH TALKING IN NOMINATIONS NR

Bigg Boss 5 Telugu: ఇది తెలుగు షోనా.. అరెరే మరి షోలోకి ఇంగ్లీష్ వాళ్ళని తెచ్చావ్ ఏంటి బాసు?

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: స్టార్ మా లో ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తవగా ఇటీవలే సీజన్ 5 ప్రారంభమైంది. ఇక ఈ షో ఇప్పటికే పలు భాషలలో ప్రసారమవ్వగా తెలుగులో కూడా ప్రసారమై తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇంకా చదవండి ...
  • Advertorial
  • Last Updated :
    Bigg Boss 5 Telugu: స్టార్ మా లో ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తవగా ఇటీవలే సీజన్ 5 ప్రారంభమైంది. ఇక ఈ షో ఇప్పటికే పలు భాషలలో ప్రసారమవ్వగా తెలుగులో కూడా ప్రసారమై తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో మొత్తం తెలుగు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు మాత్రమే అవకాశం ఇస్తారన్న సంగతి తెలిసిందే. రియాలిటీ షో లో బెస్ట్ షోగా నిలిచిన ఈ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ను తెలుగు షో నా, ఇంగ్లీష్ షో నా అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

    నిజానికి తెలుగు షో అన్నప్పుడు తెలుగులో మాత్రమే మాట్లాడాలి. అంతేకానీ మరే భాషా కూడా వాడరాదు. ఈ షోలో తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. అలా ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తవగా అందులో ఇంతవరకు ఇతర భాషలకు చెందిన కంటెస్టెంట్ లు కూడా పాల్గొని వచ్చీరాని తెలుగుతో హౌస్ లో ఉంటూ చివరి వరకు బాగా ఆడారు.

    ఇది కూడా చదవండి:వెర్రి ** అవుతాను అంటూ అర్ధపావు భాగ్యం బూతుల బాగోతం.. ఇవి మాములు మాటలు కాదుబాబోయ్

    కానీ తెలుగు ప్రేక్షకులై ఉన్నా కూడా కొందరు కంటెస్టెంట్ లు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ బాగా అతి చేయడంతో బిగ్ బాస్ వాళ్లని చాలాసార్లు హెచ్చరించాడు. అయినా కూడా కొందరు ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఇంట్లో నుండి తొందరగా వెళ్ళిపోయేలా చూసుకున్నారు. గత సీజన్ లో కూడా అభిజిత్, తేజస్వి ఇంగ్లీష్ మాట్లాడటంతో బిగ్ బాస్ బాగా హెచ్చరించాడు. ఇక అభిజిత్ కంట్రోల్ అవగా తేజస్వి మాత్రం చాలాసార్లు ఇంగ్లీష్ పదాలు వాడింది.

    ఇది కూడా చదవండి:ప్రియను గుంటనక్కతో పోల్చిన నటరాజ్ మాస్టర్.. సెకండ్ వీకే కొట్టుకుచచ్చిన కంటెస్టెంట్లు?

    ఇక ఈ సీజన్ లో కూడా చాలావరకు తెలుగు సెలబ్రెటీలే ఎంట్రీ ఇవ్వగా అందులో కొందరు కంటెస్టెంట్ లు తెలుగు భాష వచ్చినా కూడా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతో ఈ షో ను చూసే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ భాష అర్థం కాకపోవడంతో చాలా వరకు చూడటం తగ్గించారు. ఎక్కువగా యాంకర్ రవి, లహరి, కాజల్, హమీద, జశ్వంత్ ఇలా మరి కొంతమంది కంటెస్టెంట్ లు షో ప్రారంభం నుండి ఇప్పటి వరకు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దీంతో ఈ షోను చూసిన నెటిజన్లు ఇది తెలుగు షో నేనా అలాంటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళని ఎందుకు తెచ్చావ్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ వీరిని తెలుగులో మాట్లాడమని ఇంకెప్పుడు హెచ్చరిస్తాడో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anne master, Bigg Boss 5 Telugu, Hamida, Instagram, Jessie, Social Media, Swetha varma, Uma devi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు