• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NETIZENS TROLLS BALAKRISHNA FOR COMMENTS ON AR RAHMAN HERE ARE THE DETAILS SR

Balakrishna : ఏఆర్ రెహమాన్‌పై నోరు జారిన బాలయ్య... ట్రోల్ చేస్తున్న నెటిజన్స్...

Balakrishna Photo : Twitter

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి నోరు జారారు. గతంలో ఓ సారి ఇంటర్వూలో బాలకృష్ణ భారతరత్న అవార్డ్‌ను ఎన్టీఆర్ కాలిగోటితో పోల్చగా.. ఈసారి

  • Share this:
    నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి నోరు జారారు. గతంలో ఓ సారి ఇంటర్వూలో బాలకృష్ణ భారతరత్న అవార్డ్‌ను ఎన్టీఆర్ కాలిగోటితో పోల్చగా.. ఈసారి తనకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు.. ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఏ ఆర్ రెహమాన్ ఎవరో తెలియదని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్య ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదిత్య 369 సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ ఇళయరాజా అదరగొట్టారని.. ఏ ఆర్ రెహమాన్ ఎవరో నాకు తెలియదని.. ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్‌ అందిస్తాడు, అలాంటి వారి గురించి నేను అసలు పట్టించుకోను అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య. ఇక మరోసారి భారతరత్న అవార్డ్స్ గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ కాలిగోటితో పోల్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. మరోవైపు ఈ వీడియో చూసిన రెహమాన్ ఫ్యాన్స్ బాలకృష్ణపై మండిపడుతున్నారు. ఒక సీనియర్ నటుడు లెజెండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పట్ల అలా మాట్లాడటం ఏంటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. రెహమాన్‌ తెలుగులో తొలిసారి సంగీతం అందించింది.. బాలకృష్ణ సినిమాకే.. నిప్పురవ్వ సినిమాకు రెహమాన్ నేపథ్య సంగీతాన్ని అందించారు.

    ఇక అది అలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో గతంలో  ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.









    ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు క్రాక్ డైరక్టర్ గోపీచంద్ తో దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published: