హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Anasuya : ఆ వీడియోను షేర్ చేసినందుకు.. యాంకర్ అనసూయను ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Anchor Anasuya : ఆ వీడియోను షేర్ చేసినందుకు.. యాంకర్ అనసూయను ఆడేసుకుంటున్న నెటిజన్స్..

 Anchor Anasuya Photo : Instagram

Anchor Anasuya Photo : Instagram

Anchor Anasuya : తాజాగా అనసూయ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో అనసూయ తన భర్త, పిల్లలతో నడుస్తుంటారు. బ్యాగ్రౌండ్‌లో విజయ్ సినిమా బీస్ట్ నుంచి పాట వస్తుంటుంది. స్లో మోషన్‌లో నడుస్తూ అదరగొట్టిన అనసూయ ఫ్యామిలీ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓ టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తుంటారు ఈ అందాల యాంకర్. అనసూయ మొదట న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత, అనసూయ జబర్దస్త్, బిందాస్, మోడ్రన్ మహాలక్ష్మి, బూమ్ బూమ్, మాస్టర్ చెఫ్ వంటి అనేక ఇతర టీవీ షోలను హోస్ట్ చేశారు. అంతేకాదు ఓ వైపు హోస్ట్‌గా చేస్తూనే క్షణం, గాయత్రి, యాత్ర, థాంక్యూ బ్రదర్, రంగస్థలం, పుష్ప (Pushpa) మొదలైన అనేక హిట్ చిత్రాలలో నటించారు అనసూయ. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో అనసూయ తన భర్త, పిల్లలతో నడుస్తుంటారు. బ్యాగ్రౌండ్‌లో విజయ్ సినిమా బీస్ట్ నుంచి పాట వస్తుంటుంది. స్లో మోషన్‌లో నడుస్తూ అదరగొట్టిన అనసూయ ఫ్యామిలీ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వావ్ అనసూయ అదరగొట్టావు.. మీ ఫ్యామిలీ అదిరిందని అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరూ మాత్రం అందరూ  ఫ్యామిలీ ప్యాక్‌తో కేక పెట్టిస్తున్నారని.. అనసూయకు బాడీగార్డ్స్‌గా ఉన్నారని.. జంబో ప్యాక్ అదిరిందని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అది అలా ఉంటే తెలుగులో టాప్ యాంకర్‌‌లలో ఒకరుగా కొనసాగుతోన్న అనసూయ ఒక్కో షోకి రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుంటారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటారు. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్నారు. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్నారు. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు.

Photo : Twitter
Anasuya Photo : Instagram

అందులో భాగంగా ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న యాంకర్ అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా కనిపించనున్నారు. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని  (Anchor Anasuya) తీసుకున్నారట.

భర్త భరద్వాజ్‌తో అనసూయ Photo : Twitter

ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తున్నట్లు టాక్.. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తున్నారట అనసూయ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఇక అనసూయ ఇటీవల పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు.

anasuya Instagram

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ నెలలో మొదలుకావాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలా లేదని టాక్. దాదాపు మూడు నాలుగు నెలల వరకు ఈ రెండో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించట్లేదని అంటున్నారు. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో ఈ సినిమా విడుదల ఈ ఏడాదిలో ఉంటుందో లేదో చూడాలి.

First published:

Tags: Anchor anasuya, Tollywood news

ఉత్తమ కథలు