Bandla Ganesh: అవమానాలపాలైన బండ్ల గణేష్.. దారుణంగా తిడుతున్న నెటిజన్స్.. కారణం?

bandla ganesh

Bandla Ganesh: సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఉందని అర్థమవుతోంది. ఇక చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు.

  • Share this:
    Bandla Ganesh: సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఉందని అర్థమవుతోంది. ఇక చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు. ఇక కొందరు పిల్లలైతే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సోషల్ మీడియా పట్ల అంతా ముందున్న ఈ సమాజం.. సోషల్ మీడియా పై సరిగ్గా జ్ఞానం లేక బండ్ల గణేష్ నవ్వుల పాలయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే‌..

    బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన మాట్లాడే మాటల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్లే ఉంటాడు కానీ కొన్ని కొన్ని తప్పులు వెంటనే తెచ్చుకుంటాడు. ఈయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టే ట్వీట్ల్ తెగ వైరల్ గా మారుతాయి. చాలా సార్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఏదైనా విషయం గురించి ట్వీట్ చేసినప్పుడు.. చాలా వరకు తప్పులు వస్తుంటాయి. ఇక వాటిని డిలీట్ చేసి మళ్లీ షేర్ చేస్తుంటాడు. ఇలా పలుమార్లు తప్పులు చేస్తే సరిదిద్దుకొని నెటిజనుల ట్రోలింగ్ లో ఇరుకుతాడు. ఇదిలా ఉంటే మరో సారి మరో తప్పు తో దొరకగా.. నెటిజనులు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.

    తాజాగా బండ్ల గణేష్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. దానికి సంబంధించిన విషయం గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కానీ తాను రీ ఎంట్రీ ఇవ్వనున్న ఇన్ స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇవ్వకుండానే.. ఇదే నా ఐడీ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఐడీ మర్చిపోయిన విషయం తెలుసుకొని రెండుసార్లు డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేశాడు. అయినా కూడా ఐడీ లింక్ పంపకుండా అదే తప్పు చేశాడు. ఇక దీంతో నెటి జనులకు మండి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: