కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) టాలీవుడ్ అప్‌కమింగ్ యంగ్ హీరోల్లో ఒకరు. 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. కిరణ్ అబ్బవరం ఇంతవరకు అనేక షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇప్పటివరకు అతడు ఏడు సినిమాల్లో నటించాడు. తాజాగా కిరణ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్లో కిరణ్ అబ్బవరం కనిపించాడు.
అయితే అతడు మేకప్ వేసుకొని షూటింగ్‌కు వెళ్తున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తుంది. అయితే కిరణ్ నడుచుకొని వెళ్తుండగా.. అతని వెంట ఓ అసిస్టెంట్ గొడుగు పట్టుకొని ఫాలో అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ వీడియోపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంబరిల్లా అవసరమా బ్రో నీకు కూడద అంటూ.. ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
దీనికి బదులిస్తూ.. మరొకరు ఇంక మహేష్ బాబు అనుకున్నా అంటూ మరో నెటిజన్ పోస్టు చేశాడు. ఏంటి ఈడికి గొడుగు పట్టాలా అంత ఉంది ఏంటి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు ప్రమోషన్ స్టార్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.కిరణ్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం 15 జులై, 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రాయచోటి లో జన్మించాడు.
View this post on Instagram
కిరణ్ ఇప్పటివరకు ఎస్ఆర్ కళ్యాణ మండపం,సెబాస్టియన్,సమ్మతమే, కోడిదివ్య ఎంటర్టైన్మెంట్, వినరో భాగ్యము విష్ణు కథ, రాజువారు రాణివారు వంటి సినిమాల్లో నటించాడు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సమ్మతమే సినిమా జూన్ 24 థియేటర్లలో విడుదల కానుంది. ఇక కిరణ్‌కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiran abbavaram, Tollywood