హోమ్ /వార్తలు /సినిమా /

Hyper Aadi: హైపర్ ఆది పరువు పోయిందిగా.. సుడిగాలి సుధీర్ లేకుంటే.. పెంట పెంట చేస్తున్నారు..!

Hyper Aadi: హైపర్ ఆది పరువు పోయిందిగా.. సుడిగాలి సుధీర్ లేకుంటే.. పెంట పెంట చేస్తున్నారు..!

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది

రెండు ఎపిసోడ్స్ లో సుధీర్ అన్న లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ పెంట పెంట చేశారంటూ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. టీఆర్పీ రేటింగ్ మాటేమోకానీ.. ఉన్నది పోయేలా ఉందంటూ.. సెటైర్లు వేస్తున్నారు.

హైపర్ ఆది (Hyper Aadi Arrest) అరెస్ట్ అయ్యాడంటూ.. వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తుండగా పోలీసులు వచ్చి హైపర్ ఆదిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లు... చూపించారు. హైపర్ ఆది యాక్సిడెంట్ చేసినట్లు.. అతడు యాక్సిడెంట్ చేసిన కారణంగా ఓ వ్యక్తి  చావుబతుకుల మధ్య ఉన్నట్లు పోలీసులు వచ్చి షోలో హల్ చల్ చేశారు. దీంతో షోలో ఉన్న ఆర్టిస్టులంతా షాక్ అయ్యారు. రష్మీ, పూర్ణ, మిగతా వాళ్లు ఉండగానే.. హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఈ(Sridevi Drama Company) ప్రొమోపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.

షోలో ఎవ్వరూ తగ్గడం లేదు.. ఎవరికి వారు ఇరగదీస్తున్నారు... బలవంతపు కామెడీ సీన్లు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మరో వ్యక్తి .. మల్లెమాల వాళ్ళకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఎందుకంటే హైపర్ ఆది ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు తనకి కారు , బైకు ..రాదు అని మరి యాక్సిడెంట్ ఎలా చేస్తాడు ? టిఆర్పీ కోసం వేషాలు వెయ్యొద్దు శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అంటూ.. కామెంట్ పెట్టాడు. మరికొందరు పోలీస్ అన్న యాక్టింగ్ బాగుంది అంటూ పోస్టులు చేస్తున్నారు. మరో నెటిజన్ .. రెండు ఎపిసోడ్స్ లో సుధీర్ (Sudigali Sudheer) అన్న లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ పెంట పెంట చేశారంటూ కామెంట్ చేశాడు. మరొకరు ఈ షోకు.. సుధీర్, ఇంద్రజ వల్లే గుర్తింపు అంటూ పోస్టు చేశాడు. 

ప్రొమో అంత ఇంట్రస్టింగ్‌గా ఉంది కానీ.. లాస్ట్ లో ఈ స్టంట్‌లతో మా హార్ట్‌కు స్టంట్‌లు వేసుకునేలా చేస్తున్నారు. trp పెరగడం పక్కన పెడితే ఉన్నది పోయేలా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.  రష్మీతో(Rashmi) పాటు మా సుధీర్ అన్నా ఉంటే చాలా బాగుండును. మిస్ యూ సుధీర్ అన్నా . నీవు లేకుండా ఈ షో చూడలేక పోతున్నాము అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ‘ అక్కడ ఏం ఉండదు...TRP రేటింగ్ కోసం ఇలాంటివి ఎన్ని చేస్తారు అన్న.. షోలో కొత్తగా చెయ్యడం ట్రై చెయ్యండి.. అంతే కాని జనాలని పదే.. పదే.. బక్ర చేస్తున్నారు కాద అన్న.. జనాలు షో ఇష్టం ఉండి చూస్తున్నారు.. కాని మీరు ఇలా చేస్తారు... ఇలా చేస్తే ఎలా అండి.. స్కిట్స్ ఎక్కువ చెయ్యండి.. సర్’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

సుధీర్ అన్న లేడు రేటింగ్ రావటం లేదు అందుకే ఇలాంటి మొత్తం ప్లాన్ చేసి మనకి చూపిస్తున్నారు ఎన్ని చూడలేదు గురు ఎలాంటి సుధీర్ అన్న కింగ్ అది అందరికీ తెలుసు అంటూ నెటిజన్లు వరుస పోస్టులు పెడుతూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోపై విమర్శలు గుప్పిస్తున్నారు.

First published:

Tags: Hyper Aadi, Hyper aadi special skit, Sridevi Drama Company Latest Promo

ఉత్తమ కథలు