శ్రీముఖి.. తెలుగు బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా ఎదిగింది. వరుసగా షోలు చేస్తూ శ్రీముఖి(Sreemukhi) సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీముఖి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ... ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. డాన్సింగ్ వీడియోలు కూడా శ్రీముఖి షేర్ చేస్తుంది. అయితే తాజాగా శ్రీముఖి చేసిన ఓ యాడ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సుపై ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి యాడ్స్ ఎందుకు చేస్తున్నావు అంటూ.. శ్రీముఖిపై మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి ఓ గేమ్ యాప్ గురించి యాడ్ చేసింది. ఈ యాడ్ కోసం ఆమె గ్రీన్ కలర్ డ్రెస్సులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్సుపై పలువురు నెటిజన్స్ ,ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత డబ్బులిస్తే మాత్రం ఇలాంటి యాడ్స్ కూడా చేస్తావా.. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని ప్రమోట్ చేస్తావా అంటూ ఓ నెటిజన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరికొందరు బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అన్న విషయం తెలియదా? అని అడుగుతున్నారు. అసలు బెట్టింగ్స్ గేబ్లింగ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
మరికొందరు నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ పై మండిపడుతున్నారు. ‘మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. మీరు ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఎలా’ అని ప్రశ్నిస్తున్నారు. మరో నెటిజన్ ‘కొంచెం డ్రెస్సులు మార్చు రాములమ్మ... ఇలాంటి డ్రెస్సులు నీకెందుకు ’ అని సూచిస్తున్నారు. సారీ టు సే.. నాట్ ఎక్స్‌పెక్టింగ్ లాంగ్ వీ నెక్ అని మరో నెటిజన్ పోస్టు చేశారు. మొత్తం మీద శ్రీముఖి చేసిన యాడ్‌తో పాటు... ఆమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పైన మరి శ్రీముఖి ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే శ్రీముఖి ఇటు టీవీ షోలు చేస్తూ.. అటు సినిమాల్లో కూడా బిజీగా మారింది. ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor Sreemukhi, Sreemukhi, Tv actress