హోమ్ /వార్తలు /సినిమా /

Sid Sriram: సిద్ శ్రీరామ్ పాటపై ట్రోలింగ్.. వినలేకపోతున్నామంటూ కామెంట్లు

Sid Sriram: సిద్ శ్రీరామ్ పాటపై ట్రోలింగ్.. వినలేకపోతున్నామంటూ కామెంట్లు

సిద్ శ్రీరామ్

సిద్ శ్రీరామ్

తాజాగా సిద్ పాడిన పాటపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు పాటపై భయంకరమైన పోస్టులు చేస్తున్నారు.

  సిద్ శ్రీరామ్(Sid Sriram).. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. తాజాగా విడులైన మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్(Sid Sriram). అతని పాట వింటే చెవిలో తేనే పోసినట్లు ఉంటుంది. ఎలాంటి పాటనైనా తన గొంతుతో మెస్మరైజ్ చేస్తుంటాడు. పాటను గుండెకు హత్తుకునేలా ఎక్కడికో తీసుకెళ్తాడు. పాట ఏదైనా అది సిద్ పాడితే హిట్ అవ్వాల్సిందే. సినిమా పోయినా.. సిద్ పాడిన పాటలు మాత్రం హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సిద్ పాటపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ఓ పాటను వినలేకపోతున్నామంటూ..నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ పాట ఏది అనుకుంటున్నారు.

  వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

  రొమాంటిక్ సాంగ్ ‘కుంకుమలా’ టైటిల్ తో ఫస్ట్ సింగిల్ టీజర్ ను తాజాగా తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. హిందీలో రణ్‌బీర్, అలియా భట్ వెడ్డింగ్ కానుకగా ‘కేసరియా’ టైటిల్ తో రిలీజ్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ సాంగ్ టీజర్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్,దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే విడుదల చేశారు. ‘బ్రహ్మాస్త్రం : పార్ట్ వన్ నుంచి ‘కుంకుమలా’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఐదేండ్ల కింద స్టార్ అయిన ఈ చిత్ర షూటింగ్.. చివరిగా ఈ ఏడాది మార్చిలో పూర్తి చేసుకుంది. రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

  ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు హిందీలో అమిత్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. తెలుగులో చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హిందీలో స్టార్ సింగర్ ఆర్జిత్ సింగ్ పాడగా.. తెలుగులో రొమాంటిక్ సాంగ్స్ స్పెషలిస్ట్ సిద్ శ్రీరామ్ ఈ పాట పాడారు. అయితే ఇప్పుడు ఈ పాటపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు పాటపై భయంకరమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు లిరిక్స్ బాలేదంటే.. మరికొందరు పాట వినలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో కూడా అర్జిత్ సింగ్ పాడితేనే... ఈ పాట బావుండేదని అన్నారు. మరికొందరు మాత్రం ఇంతవరకు ఇలా తెలుగులో హిందీ సినిమా టీజర్లు రిలీజ్ అయ్యాయా? అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద.. తొలిసారిగా సిద్ పాటకు నెగెటివ్ కామెంట్లు రావడంతో.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor, Sid sriram

  ఉత్తమ కథలు