సోషల్ మీడియా వచ్చాక.. జనం... తమ అభిప్రాయాల్ని ఫ్రీగా చెప్పేస్తున్నారు, సెలబ్రిటీ అయినా.. పొలిటీషియన్స్ అయినా.. ఎవడైతే మాకేంటి.. మేం చెప్పాల్సింది చెబుతాం అంటూ.. సోషల్ మీడియా వేదికగా తమ మనసులో ఉన్న భావాల్ని బయట పెట్టేస్తున్నారు. ఇక సెలబ్రిటీలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లు, సినిమా, సీరియల్స్ ఆర్టిస్టులకు సోషల్ మీడియాలో వేలు, లక్షల్లో వారికి ఫాలోవర్స్ ఉంటున్నారు. అయితే వారు ఏ పని చేసినా దానిపై కామెంట్లు పెడుతుంటారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) పై నెటిజన్స్ ఘోరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ఆమె వేసుకున్న డ్రెస్సే కారణమని తెలుస్తోంది.
తాజాగా రాఖీ సావంత్ రెడ్ కలర్ డ్రెస్సులో కనిపించింది. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ,పాపులర్ డ్రామా క్వీన్ అయిన రాఖీ సావంత్, ఆమె ఏదైనా ఈవెంట్‌కి చేరుకున్నప్పుడల్లా ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఆమె చేసిన చేష్టలు హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. తాజాగా బాలీవుడ్‌లో జరిగిన డిజిటల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా రాఖీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. డ్రామా క్వీన్ (రాఖీ సావంత్ వైరల్ వీడియో) వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రాఖీ డ్రెస్సింగ్ చూసిన జనాలు ఆమెకు క్లాసులు తీసుకొని చీవాట్లు పెడుతున్నారు.
View this post on Instagram
రాఖీ సావంత్‌కి సంబంధించిన తాజా వీడియోను బాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్లిప్‌లో, ఐటెమ్ గర్ల్ రెడ్ ఫ్రంట్ ,సైడ్ కట్ సీక్విన్ డ్రెస్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది. అన్నింటిలో మొదటిది, రాఖీ రవీనా టాండన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత మరికొందరు సెలబ్రిటీలు వస్తే వారితో ఫోటోలు దిగింది. రాఖీ సావంత్ పక్కన నిలబడటానికి నటులు ఇబ్బంది పడుతున్నారని.. వారి ముఖాల్లో ఆ ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుందని ఓ నెటిజన్ చెప్పారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ అవును నిజమే అన్నారు. మరికొందరు రాఖీ.. ఉర్ఫీ జావెద్‌ను కాపీ కొడుతుందని కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Rakhi Sawant