మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కూతరు మంచు లక్ష్మీ.. (Manchu Lakshmi) టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి తెలిసిందే. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. అయితే ఆమె పెట్టిన పోస్టులకు ప్రశంసలు కురిపించిన వారితో పాటు.. విమర్శలు చేసే వారు కూడా ఎక్కువే. అలా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) తాజాగా చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది.
ఈ ఫోటోలో మంచు లక్ష్మీ(Manchu Lakshmi) తన ఇంట్లో ఉన్న షూ రేక్స్ వద్ద కూర్చొంది. తన ముందు ఏడు ఎనిమిది జతల షూస్ వేసుకొంది. దానికి ఆమె నెవ్వర్ యావ్ ద రైట్ షూ అని క్యాప్షన్ పెట్టింది. అంటే సరైన షూ ఎప్పటికీ లేదు అంటూ పోస్టు పెట్టింది. ఇక ఈ పోస్టుపై నెటిజన్స్ వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట’ అంటూ పోస్టు పెట్టాడు. మరో నెటిజన్ కొత్త షాపు ఓపెన్ చేశారా .. కాంగ్రాట్స్ అంటూ కామెంట్ చేశాడు. మంచు లక్ష్మీ షో ఆఫ్ చేస్తుందని మరికొందరు అన్నారు. మరో నెటిజన్ ‘నీకు భగవంతుడు ఇన్ని రకాల షూస్ ఇచ్చాడు. నువ్వు వాడనప్పుడు వాటిని ఓ జత కూడా చెప్పులు లేని నిరు పేదలకు ఇవ్వొచ్చు కదా అంటూ కామెంట్ చేశాడు.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు లక్ష్మీ.. తమిళ్ ,తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో చేసిన పాత్రకు గాను.,, మంచు లక్ష్మీకు 2012న నంది అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా దొంగాట సినిమా లో ఏందిరో అనే పాటకు గాను ఆమెకు గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.ఇక ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిలింఫేర్ అవార్డ్ కూడా గెలుచుకుంది మంచు లక్ష్మీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Lakshmi