సెలబ్రిటీలు ఎంత పాపులర్ అవుతున్నారో.. వారి పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)... అతని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ ... స్నేహారెడ్డిని (Allu Sneha Reddy) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి బర్త్ డేలతో పాటు.. పిల్లలు చేసే సందడికి చెందిన అనేక విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్.. అతని భార్య స్నేహ షేర్ చేస్తూ ఉంటారు.అయితే అల్లు అర్జున్, స్నేహాల గారాల పట్టి అర్హ(Allu Arha) చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే సందడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా సమంత(Samantha) కీలక పాత్ర చేస్తున్న ‘శాకుంతలం’(Shakuntalam) సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇస్తోంది అల్లు అర్హ. తొలి సినిమాలోనే తన అద్భుత నటనతో ఆకట్టుకుంది అర్హ. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హ(Allu Arha) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత తక్కువ వయసులోనే ప్రఖ్యాత నోబుల్ అవార్డును(Nobel Award) అందుకుంది. అయితే ఇన్ని స్పెషాలిటీలో ఉన్న అర్హ చేసిన ఓ చిన్న పనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్నారిపై కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందంటే.. తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతుండగా మధ్యలో అల్లు అర్హ కూడా వచ్చింది. దీంతో ఆ యాంకర్ చిన్నారి నీ పేరేంటి అని అడిగారు. ఆ మాటకు అర్హ.. అల్లు అర్హా రెడ్డి అని సమాధానం ఇచ్చింది.
దీంతో అర్హ చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అవుతున్నారు. అల్లు అర్హ తన పేరుని అల్లు అర్హ రెడ్డిగా చెప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యాస్ ఫీలింగ్ లేదంటూనే.. అల్లు అర్హా రెడ్డిగా పేరు పెట్టుకున్నారు. డాడి లాస్ట్ నేమ్‌తో పాటు.. మామ్ క్యాస్ట్ నేమా హా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, స్నేహా రెడ్డి సామాజిక వర్గం చెందిన ఆమె అని అందరికి తెలిసిందే. మరి దీనిపై బన్నీ ఆయన భార్య ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu arha, Allu Arjun, Allu Arjun Wife Sneha Reddy, Allu sneha reddy