హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu : పాయల్‌రాజ్‌పూత్,సన్నీలియోన్ ఉంటే నన్నెవరు చూస్తారు:మంచు విష్ణు..కరెక్ట్ చెప్పని ట్రోల్

Manchu Vishnu : పాయల్‌రాజ్‌పూత్,సన్నీలియోన్ ఉంటే నన్నెవరు చూస్తారు:మంచు విష్ణు..కరెక్ట్ చెప్పని ట్రోల్

vishnu,sunny,payal(file)

vishnu,sunny,payal(file)

Manchu Vishnu: జిన్నా మూవీ టీజర్‌ లాంచ్‌లో మంచు విష్ణు తన స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా హీరోయిన్‌లు పాయల్‌రాజ్‌పూత్, సన్నీలియోన్‌లను పొగడటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ తమ గొప్పలు చెప్పుకుంటుంటే ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇప్పుడు తగ్గించుకున్నా వదలడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఫిల్మ్ ఇండస్ట్రీలో కోరి మరీ ట్రోలింగ్‌ని కొని తెచ్చుకునే వాళ్లు ఎవరుంటారంటే మంచు విష్ణు(Manchu Vishnu అనే అందరూ అనుకుంటున్నారు. రీసెంట్‌గా మంచు విష్ణు హీరోగా రైటర్ కోన వెంకట్‌ (Writer Kona Venkat)కాంబోలో వస్తున్న మూవీ జిన్నా(Ginna). ఈసినిమా టీజర్‌ Teaserలాంచ్‌ ప్రోగ్రామ్‌లో మంచు విష్ణు తన స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా హీరోయిన్‌లు పాయల్‌రాజ్‌పూత్(Payal Rajpoot), సన్నీలియోన్‌(Sunny Leone)లను పొగడటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ తమ గొప్పలు చెప్పుకుంటుంటే ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇప్పుడు తమని తాము తగ్గించుకొని మాట్లాడుతున్నా వెటకారంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆయన మాటలపై మీమ్స్‌ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

CM House: సీఎం ఇంట్లో తమన్నా, దీపిక సీరియస్ డిస్కషన్... ?

మంచు విష్ణుపై ట్రోల్స్ ..

మంచు విష్ణు కలెక్టర్ కింగ్ మోహన్‌బాబు కుమారుడే కాదు ..నటుడు, నిర్మాత, మా అసోసియేషన్ ప్రెసిడెంట్. విద్యాసంస్థలకు ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్ని క్వాలిఫికేషన్స్‌ ఉన్న హీరో తన అప్‌కమింగ్ మూవీ జిన్నా టీజర్ లాంచ్‌ సందర్భంగా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఆయనకే పెద్ద తలనొప్పిగా మారాయి. ఢీ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న విష్ణు..అందుకోసం చాలా ప్రయోగాలు చేశారు. ఫైనల్‌గా జిన్నా సినిమాతో రైటర్‌ కోన వెంకట్, డైరెక్టర్ సూర్య కాంబినేషన్‌లో పని చేస్తున్నారు. ఈసినిమా నటీనటులు, సాంకేతిక బృందం గురించి మాట్లాడుతూ హీరోయిన్‌లు పాయల్‌రాజ్‌పూజ్‌, సన్నీలియోన్‌లను పెట్టడం తనకు ఇష్టం లేదని టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. శృంగారతారగా పేరున్న సన్నీలియోన్‌కి ఉన్న, క్రేజ్‌ తనను డామినెట్ చేస్తుందని భయపడిన విషయాన్ని విష్ణు పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. అంతే కాదు ఆర్‌ఎక్స్‌100 మూవీతో హాట్‌ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్‌రాజ్‌పూత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె కూడా గ్లామర్‌లో ఏమాత్రం తగ్గదని ...ఇలాంటి ఇద్దరు బ్యూటీలు సినిమాలో తన సినిమాలో ఉంటే ఇంక తనను ఎవరూ చూస్తారని డైరెక్టర్‌గా తన తండ్రి మోహన్‌బాబు, రచయిత కోన వెంకట్‌కి చెప్పానని విష్ణు అన్నారు. చివర్లో కచ్చితంగా ఈసినిమా హిట్టవుతుందని చెప్పారు.

ఎలాగైనా వదలని నెటిజన్లు..

మంచు విష్ణు చేసిన ఆ వ్యాఖ్యలనే నెటిజన్లు పట్టుకున్నారు. నిజంగానే జిన్నా సినిమా చూడాల్సి వస్తే సన్నీలియోన్, పాయల్‌రాజ్‌పూత్ కోసం చూస్తాం కాని నీ కోసం ఎందుకు చూస్తామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే వాళ్లిద్దరి మధ్యలో నువ్ దేనికి సినిమా చెడ చెడగొట్టడానికా అంటూ కామెంట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక సినిమా టీజర్‌పై యూట్యూబ్‌లో వచ్చిన మంచి రెస్పాన్స్ కంటే ఆయన చేసిన కామెంట్స్‌పై ట్రోలింగ్ అంతకు మించి అన్నట్లుగా ఉంది.

Manchu Vishnu: పాయల్, సన్నీలియోన్ హీరోయిన్స్ అని చెప్పగానే ఆ ఫీలింగ్.. చివరకు!

కంటిన్యూ అవుతుందా ..

ఏదో మాట్లాడదామనుకొని ఇలా మాట్లాడారా లేక సినిమాకి హైప్ తేవడానికి తనను తాను తగ్గించుకుంటే ట్రోలింగ్‌ ద్వారా మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయని భావించారో తెలియదు కాని మంచు విష్ణు మాత్రం మరోసారి సినీ అభిమానులకు, నెటిజన్లకు కార్నర్ అయ్యారు. మంచువారబ్బాయి ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడుతారో లేక పబ్లిసిటీ బాగుంది కదా అని ఇలాగే కంటిన్యూ చేస్తారో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Fans trolling, Hero manchu vishnu, Tollywood actor