హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya:బెడ్రూంలో నా ఇడియట్ లేడు .. అనసూయ పోస్ట్ చేసిన వీడియోపై ట్రోలింగ్

Anasuya:బెడ్రూంలో నా ఇడియట్ లేడు .. అనసూయ పోస్ట్ చేసిన వీడియోపై ట్రోలింగ్

(Photo:Instagram)

(Photo:Instagram)

Anasuya Bharadwaj:సెలబ్రిటీగా మారిన యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌తో విమర్శల పాలవుతోంది. రీసెంట్‌గా ఓ వీడియోతో పాటు ఆమె పెట్టిన కామెంట్‌కి కాంప్లిమెంట్స్ రాకపోగా..పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓ కామెడీ షోకి యాంకర్‌గా బుల్లితెరకు పరిచమైన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)ఇప్పుడు ఓ స్థాయి నటిగా మారింది. స్మాల్ స్క్రీన్‌తో పాటు సిల్వర్ స్క్రీన్‌పై ఐటమ్ సాంగ్స్, మసాలా పాత్రలు, లేడీ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీ హోదాకు చేరుకున్న అనసూయ సోషల్ మీడియా(Social media)లో మాత్రం అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్, ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌తో విమర్శల పాలవుతోంది. రీసెంట్‌గా ఓ వీడియో(Video)ని షేర్ చేసి దానికి ఆమె పెట్టిన కామెంట్‌కి కాంప్లిమెంట్స్ రాకపోగా..పెద్ద ఎత్తున ట్రోల్(Trolling) చేస్తున్నారు. మాటల్లో చెప్పలేనంత దిగజార్చినట్లుగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

Anasuya: అందాలు ఆరబోయడంలో అనసూయది వేరే లెవెల్ .. చిరిగిన ప్యాట్‌తో పిచ్చెక్కిన రంగమ్మత్త

బెడ్రూం వీడియోతో ట్రోలింగ్..

టీవీ షోలు, ఈవెంట్స్, సినిమాల్లో ఎంత చలాకీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా అంతే ఓపెన్‌గా ఉంటుంది. తన రియల్‌ లైఫ్‌లోని ప్రతి మూమెంట్‌ని జాలీగా ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. గతంలో ఓసారి అనసూయ ఆమె భర్త బీచ్‌లో ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలు షేర్ చేసిన సంగతి మర్చిపోని అనసూయ ...మళ్లీ బెడ్రూం వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేసి నెటిజన్లతో చులక కామెంట్స్‌ని రిసీవ్ చేసుకుంటోంది. తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ను ఇడియట్ ఊరెళ్లినప్పుడు ఒక్కదాన్నే పడుకోవాల్సి వస్తుందంటూ అసంతృప్తిగా ఫేస్ ఫీలింగ్స్ పెట్టి మాట్లాడిన వీడియోని బెడ్ చూపిస్తూ చెప్పింది అనసూయ. ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.

అనసూయకు అవమానం..

అనసూయను గతంలో కూడా ఇలాంటి వీడియోలు, ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.అప్పుడు కూడా ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన నెటిజన్లు ...ఇప్పుడు అంతే గట్టిగా విమర్శిస్తున్నారు. కెన్ ఐ జాయిన్ విత్ యు అంటూ ఒకరు , స్వీట్ డ్రీమ్స్ ఇట్ మీన్స్ టు మీ అంటూ మరొకరు కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు. గతంలో ఆంటీ అంటేనే నెటిజన్లు హద్దులు దాటుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డ అనసూయ ఈ తరహా వీడియోలు, ఫోటోలను షేర్ చేసి కామెంట్స్ పెడితే రెస్పాన్స్ ఇలా ఉండక మరెలా ఉంటుందని మరికొందరు విమర్శిస్తున్నారు.

రియాక్షన్ ఎలా ఉంటుందో..?

సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాధించుకున్న అనసూయ.. తాను షేర్ చేసిన వీడియోపై వచ్చిన కామెంట్స్‌కి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందా లేక రచ్చ రచ్చ చేసి మరోసారి విమర్శలపాలవుతుందో రంగమ్మత్త.

First published:

Tags: Anasuya Bharadwaj, Jabardast, Viral Videos

ఉత్తమ కథలు