హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya : అనసూయ నువ్వు ఆంటీ ఏంటీ .. నిన్నుచూస్తే అదిరిపోవాలంతే .. సపోర్ట్‌ చేసిన శ్రద్ధదాస్‌పై ట్రోలింగ్

Anasuya : అనసూయ నువ్వు ఆంటీ ఏంటీ .. నిన్నుచూస్తే అదిరిపోవాలంతే .. సపోర్ట్‌ చేసిన శ్రద్ధదాస్‌పై ట్రోలింగ్

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Anasuya: యాంకర్ అనసూయ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంటీ అన్నందుకు ఆమె ఫీలైపోయి చేసిన ట్వీట్‌కు తెగ ట్రోల్ చేస్తుంటే మధ్యలో దూరింది మరో సెకండ్‌ హీరోయిన్‌. ఆమెను వదిలిపెట్టడం లేదు సోషల్ మీడియా ఫాలోవర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సెలబ్రిటీలకు పబ్లిసిటీ పిచ్చి పట్టకుందా లేక సోషల్ మీడియా(Social media)లో ఏదో రకంగా తమ పేరు నానుతూ ఉండాలని ప్లాన్ చేస్తున్నారో తెలియదు కాని ముక్కు,ముఖం తెలియని వాళ్లతో ట్విట్టర్‌లో కొట్లాట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ట్విట్టర్‌(Twitter)లో ఫైట్‌ చేస్తున్న వాళ్లలో నిన్నటి వరకు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ(Ramgopal Varma), నిర్మాత బండ్లగణేష్‌(Bandlaganesh)పేరు మాత్రమే బాగా వినిపించేది. ఇప్పుడు యాంకర్ అనసూయ(Anasuya)పేరు మార్మోగిపోతోంది. అనసూయను నెజిటన్లు(Negitans)ట్రోల్ చేస్తుంటే మధ్యలో దూరిన మరో సెకండ్‌ హీరోయిన్‌ని కలిపి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.


Ali daughter: ఘనంగా అలీ కూతురు ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?


పేరు కోసమే వివాదమా..
జబర్దస్త్ యాంకర్ అనసూయ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని బుల్లితెరపై డ్యాన్స్‌లు, వెండితెరపై విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో అంతే పాపులారిటీ సంపాధించుకుంది. సరే దాన్ని కంటిన్యూ చేద్దామని చాటింగ్, ఫోటోలు షేర్ చేస్తూ ఇప్పుడు కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటున్నారు అనసూయ. రీసెంట్‌గా ఆమెను ఆంటీ అంటున్నారని చాలా చులకనగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ట్విట్టర్ వేదికగా నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఇష్యూ ఇప్పుడు ముదిరిపోయింది. అనసూయ ఇద్దరు పిల్లల తల్లి 37సంవత్సరాలు ఉంటే ఆంటీ కాక ఏమవుతుందని ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు.


పిట్టపోరు పిట్టపోరు దేనికంటా..

అనసూయను ఓ రేంజ్‌లో నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది యాక్టరస్ శ్రద్ధదాస్. బాధ పడకు అనసూయ నీ వయసులో సగం ఉన్నవాళ్లకంటే నువ్వే చాలా యంగ్‌గా ఉన్నావంటూ అనసూయకు అండగా నిలబడింది. నిన్ను చూస్తే అదిరిపోవాలంతే అంటూ కామెంట్స్ షేర్ చేసింది శ్రద్ధదాస్. అంతటితో ఆగకండా నీ వయసుకు రెట్టింపు ఉన్న అంకుల్స్‌ కంటే నువ్వే హాట్‌గా ఉన్నావు నీ అభిమానినైపోయా అంటూ ట్వీట్ చేసింది శ్రద్ధదాస్.


ఇక శ్రద్ధదాస్ వంతు..

అనసూయను ఓదార్చాలని ట్రై చేసిన శ్రద్ధదాస్‌ని టార్గెట్‌ చేసుకున్నారు నెటిజన్లు. టాపిక్ తనవైపు డైవర్ట్ అయిందని తెలుసుకున్న శ్రద్ధదాస్ వెంటనే మరోపోస్ట్ చేసి నన్ను తిట్టడానికి మీ టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు..నన్ను ట్రోల్ చేస్తే నేను బ్లాక్ చేయడమో, డిలీట్ చేయడమో చేస్తానంతే అంటూ చురకలు అంటించింది. అనసూయను మెచ్చుకున్నందుకు నన్ను ట్రోల్ చేయడంలో అర్ధం లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది శ్రద్ధదాస్.


Published by:Siva Nanduri
First published:

Tags: Anasuya Bharadwaj, Shraddha Das, Tollywood actress

ఉత్తమ కథలు