Home /News /movies /

NETIZENS TROLL OVER BOLLYWOOD STAR SHAHID KAPOOR LIPLOCK VIDEO GOING VIRAL ON SOCIAL MEDIA SNR

Bollywood: షాహీద్‌కపూర్‌కి లిప్‌లాక్ కిస్ ఇచ్చిన భార్య ..వైరల్‌ అవుతున్న వీడియోపై ట్రోలింగ్

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Video Viral: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌కపూర్‌ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ భార్య మీరాకపూర్‌కి లిప్‌లాక్ కిస్ ఇచ్చారు ఈ బాలీవుడ్ అర్జున్‌రెడ్డి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోపైనే నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏం చేసినా సెన్సేషనల్ వార్తే. ఎలా ప్రవర్తించినా వైరల్ న్యూస్ అవ్వాల్సిందే. సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోయిన్‌తో కచ్చా రొమాన్స్ , లిక్‌ లాక్ సీన్స్, ఐటమ్ సాంగ్స్‌ చేస్తే థియేటర్లలో విజిల్స్‌ వేస్తారు. అదే హీరో, హీరోయిన్లు తమ లైఫ్ పార్టనర్స్‌, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే చాలు సోషల్ మీడియా(Social media)లో రచ్చ చేసేస్తారు. ప్రజెంట్ బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్‌కపూర్‌(Shahid Kapoor)పరిస్థితి అలాగే తయారైంది. బాలీవుడ్ (Bollywood)అర్జున్‌రెడ్డి రీసెంట్‌గా ఓ పార్టీలో తన భార్య మీరాకపూర్‌(Mirakapoor)తో కలిసి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్‌ మధ్యలో తన లైఫ్ పార్టనర్ మీరాకపూర్‌ షాహిద్‌కపూర్‌కి లిప్‌లాక్(lip lock) కిస్ పెట్టింది. షాహిద్‌కపూర్‌కి భార్య ముద్దుపెట్టిన వీడియో(Video)ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్(Viral)అవుతుంది.

ముద్దుపెట్టుకుంటే ఇంత రచ్చా ..
బాలీవుడ్‌లో షాహిద్‌కపూర్, మీరాకపూర్‌కి రొమాంటిక్ కపుల్‌ అనే పేరుంది. చాలా వరకు పబ్లిక్ ప్లేసుల్లో , పార్టీల్లో ఈ తరహాలో ఎప్పుడూ కనిపించకపోవడంతో ఇప్పుడు ఆ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరో పర్సనల్‌ లైఫ్‌లోకి తొంగి చూసి మరీ సోషల్ మీడియా వేదికగా ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్లు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ లాక్ పడిపోయింది కదా..ఇప్పుడు పబ్లిక్‌గా లిప్‌లాక్ పడింది అంటూ ఒకరు కామెంట్ చేస్తే ...ఇందులో వింత ఏముంది సినిమాల్లో చాలా మంది హీరోయిన్లకు షాహిద్‌కపూర్ ముద్దులు పెడితే ..రియల్ లైఫ్‌లో హీరోకి ఆయన భార్య ముద్దుపెట్టింది అంతేగా అని మరొకరు కామెంట్స్‌ని షేర్ చేశారు. ఇంకొందరైతే అన్న, వదిన జోడి సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.




స్టార్ హీరోకి తప్పని ట్రోలింగ్ ..
షాహిద్‌కపూర్‌కి బాలీవుడ్‌లో మంచి పేరుంది. సక్సెస్‌ఫుల్ హీరోగానే కాకుండా ఎలాంటి కాంట్రవర్సీ ఇష్యూల్లో తలదూర్చరు. అలాంటిది తన పర్సనల్ వీడియోపై ఈ రేంజ్‌లో కామెంట్స్‌ వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. టాలీవుడ్‌ అర్జున్‌రెడ్డి సినిమాని బాలీవుడ్‌లో కబీర్‌సింగ్‌ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కియారా అద్వానీతో విపరీతమైన రొమాన్స్‌ చేశారు షాహిద్‌కపూర్. ఆ సినిమా టాలీవుడ్ అర్జున్‌రెడ్డి కంటే బిగ్గెస్ట్ హిట్ అయింది. భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతే కాదు స్వయంగా డైరెక్టరే తనకు టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్‌లోనే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందన్నారు. రీల్‌ లైఫ్‌లో షాహిద్ కపూర్ చేసిన లిప్‌లాక్‌ సీన్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే..రియల్‌ లైఫ్‌లో వైఫ్‌తో చేసిన లిప్‌లాక్ సీన్‌కి మాత్రం సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్‌తో పాటు న్యూట్రల్ రెస్పాన్స్‌ వస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bollywood actor, Shahid Kapoor, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు