హోమ్ /వార్తలు /సినిమా /

Tejaswi Madivada: అమ్మాయి బుద్ధుందా అంటూ తేజస్వి పై మండిపడుతున్న నెటిజనులు.. కారణం?

Tejaswi Madivada: అమ్మాయి బుద్ధుందా అంటూ తేజస్వి పై మండిపడుతున్న నెటిజనులు.. కారణం?

Tejaswi Madivada

Tejaswi Madivada

Tejaswi Madivadaతెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది తేజస్వి.

Tejaswi Madivadaతెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది తేజస్వి. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తేజస్వి పై తెగ మండిపడుతున్నారు నెటిజన్లు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో నటించిన తేజస్వి తమిళ భాషలో కూడా నటించింది. ఇక ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని పలు పాత్రలలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో ఉన్నంత కాలం బాగా రచ్చరచ్చ చేసింది. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా బాగా డోస్ పెంచుకుంది. బిగ్ బాస్ తర్వాత తన గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోయిన తేజస్వి ఎప్పటికప్పుడు తన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఈ మధ్య తెగ ఫోటో షూట్ లంటూ బాగా పిచ్చెక్కిస్తుంది. పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ హీరోయిన్ ల బాగా రెచ్చిపోతుంది. ఇటీవలే బికినీ అందాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకోగా అది చూసిన నెటిజనులు తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఫోటో షూట్ చేయించుకున్న తేజస్వి ఓ పార్క్ లో బుద్ధుడి విగ్రహం కనిపించేటట్లు ఫోటో తీయించుకోగా తను కూడా ఒక బండరాయిపై బుద్ధిడి లా యోగా చేస్తున్నట్లు ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.

కానీ తను కాళ్లకు చెప్పులు వేసుకొని యోగా చేస్తూ కనిపించగా నెటి జనులు తీవ్రంగా మండిపడుతున్నారు. బుద్ధుడి పక్కన అలా కూర్చోడానికి బుద్ధుందా అంటూ నెటి జనులు తీవ్రంగా మండిపడుతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

First published:

Tags: Bigg boss season 2, Social Media, Tejaswi madivada, Tollywood

ఉత్తమ కథలు