హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Doctor Babu: నెటిజన్లకు అడ్డంగా చిక్కిన డాక్టర్ బాబు.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా

Karthika Deepam Doctor Babu: నెటిజన్లకు అడ్డంగా చిక్కిన డాక్టర్ బాబు.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా

nirupam paritala

nirupam paritala

Karthika Deepam Doctor Babu: తెలుగు బుల్లితెరపై గత కొన్ని నెలలుగా టాప్1 సీరియల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం. ఈ సీరియ‌ల్ రేటింగ్‌ని ఇంత‌వ‌రకు ఏ సీరియ‌ల్ బ్రేక్ చేయ‌లేక‌పోయింది. అంతేకాదు స్టార్ మాలో వ‌చ్చే స్టార్ హీరోల సినిమాలు, షోలు కూడా చాలా ఈ సీరియ‌ల్ రేటింగ్ ద‌గ్గ‌రికి రాలేక‌పోతున్నాయి

ఇంకా చదవండి ...

  Karthika Deepam Doctor Babu: తెలుగు బుల్లితెరపై గత కొన్ని నెలలుగా టాప్1 సీరియల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం. ఈ సీరియ‌ల్ రేటింగ్‌ని ఇంత‌వ‌రకు ఏ సీరియ‌ల్ బ్రేక్ చేయ‌లేక‌పోయింది. అంతేకాదు స్టార్ మాలో వ‌చ్చే స్టార్ హీరోల సినిమాలు, షోలు కూడా చాలా ఈ సీరియ‌ల్ రేటింగ్ ద‌గ్గ‌రికి రాలేక‌పోతున్నాయి. ఇక ఇందులో ప్రధాన పాత్రాధారులుగా కార్తీక్(ప‌రిటాల నిరుమ్‌), దీప‌(ప్రేమి విశ్వ‌నాథ్), సౌంద‌ర్య‌(అర్చ‌నా అనంత్), మోనిత‌(శోభా శెట్టి) త‌దిత‌రులు మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ వీరికి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఇవాళ విమెన్స్ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో నిరుప‌మ్ కూడా ఓ వీడియో మెసేజ్ ఇచ్చారు.

  మీరు లేకుండా మేము లేము అని తెలిసినా కూడా మిమ్మ‌ల్ని ఎంతో వేధిస్తుంటాము. ఏడిపిస్తుంటాము. మీ ప‌ట్ల జంతువులా ప్ర‌వ‌ర్తిస్తుంటాము. మీరు సృష్టిస్తారు. మేము నాశ‌నం చేస్తాము. మీరు ప్రేమిస్తారు. మేము మోసం చేస్తాము. అయినా స‌రే ఎంతో ఓపిగ్గా భ‌రిస్తారు. ఎంతో స‌హ‌నంతో మ‌మ్మ‌ల్ని మార్చుకుంటారు. మార్పు మాలో రావాలి. మీకు మ‌రింత గౌర‌వం ద‌క్కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచంలో ఉన్న ఆడ‌వాళ్లంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని సందేశం ఇచ్చారు.


  అయితే నిరుప‌మ్ ఇచ్చిన సందేశం మంచిదే అయిన‌ప్ప‌టికీ.. నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌లేదు. ఎందుకంటే అత‌డు న‌టిస్తోన్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో అనుమానంతో క‌ట్టుకున్న భార్య దీప‌ను క‌ష్టాల పాలు చేస్తుంటాడు కార్తీక్. దీంతో నెటిజ‌న్లు నిరుప‌మ్‌ని ట్రోల్ చేస్తున్నారు. అదంతా కాదు ముందు కార్తీక దీపం సీరియ‌ల్‌లో మీరు వంట‌ల‌క్క‌ను గౌర‌వించండి అని కొంద‌రు కామెంట్ పెట్టగా.. స‌ర్ అందులో మీ పాత్ర‌ను దిగ‌జారుస్తున్నారు. ముందు ఆ సీరియ‌ల్ మానేయండి అని ఇంకొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రేమో అందరికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు ఒక్క వంట‌ల‌క్క‌కు త‌ప్ప అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సందేశంతో నెటిజ‌న్ల‌కు అడ్డంగా చిక్కాడు నిరుప‌మ్.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Paritala Nirupam (Doctor Babu)

  ఉత్తమ కథలు