Home /News /movies /

NETIZENS TROLL ABOUT SARAYU COMMENTS WAS A SCRIPT ON SHANMUKH JASWANTH IN BIGG BOSS SEASON 5 TELUGU NR

Sarayu - Shanmukh Jaswanth: సరయు మాటల వెనుక బిగ్ బాస్ స్క్రిప్ట్.. షన్నుని ఫోకస్ చేసేందుకే ఇదంతా?

Sarayu - Shanmukh Jaswanth

Sarayu - Shanmukh Jaswanth

Sarayu - Shanmukh Jaswanth: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు కాగా ఈ వారం రోజులకే మరింత హైలైట్ గా నిలిచింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని పరిచయాలు పెంచుకున్నారు.

ఇంకా చదవండి ...
    Sarayu - Shanmukh Jaswanth: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు కాగా ఈ వారం రోజులకే మరింత హైలైట్ గా నిలిచింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని పరిచయాలు పెంచుకున్నారు. గొడవలకు కూడా దిగుతున్నారు. ఇక ఇందులో ఎలిమినేషన్ రౌండ్ పూర్తవడం.. ఎలిమినేట్ లీస్ట్ లో చేరడం అందులో నుండి బోల్డ్ బ్యూటీ సరయు హౌస్ నుండి బయటకు రావడం కూడా జరిగింది. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో సరయు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను కడిగి పారేసింది.

    సెవెన్ ఆర్ట్స్ అనే వేదికగా యూట్యూబ్ లో బూతు మాటలతో వీడియోలు చేస్తూ బాగా రెచ్చిపోతుంది సరయు. ఈమె వీడియోలను చూసిన నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో నెగెటివ్ కామెంట్స్ తో ఫైర్ అవుతుంటారు. అసలు ఈమెను వేరే వేదికపై చూస్తామని ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఏకంగా రియాలిటీ షో బిగ్ బాస్ లోనే అవకాశం అందుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఈమె వస్తుందంటేనే హౌస్ మొత్తం బూతులతో రెచ్చిపోతుందని అనుకున్నారు.

    ఇది కూడా చదవండి:నీకు వంట చెయ్యడం రాదా.. ఆర్జే కాజల్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. దొరికిపోయా అంటూ?

    ఇక మొత్తానికి బిగ్ బాస్ లో అడుగు పెట్టడం తన రచ్చ మొదలుపెట్టడం ప్రారంభించింది. అందులో తను సిగరెట్ తాగి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈమెను చూసిన ప్రేక్షకులంతా మొదటి ఎలిమినేట్ లోనే ఇంటి పట్టుపడుతుందని అనుకున్నారు. మొత్తానికి మొదటి ఎలిమినేట్ లోనే ఇంటికి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ వేదికపై ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్ తో ఇంట్లో వాళ్ల గురించి అసలు నిజం బయట పెట్టింది.

    ఇది కూడా చదవండి:యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య గొడవలు.. చిన్నమాటకు పెద్దగా.. ఎందుకో ఇంత?

    ప్రతి ఒక్కరి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక షణ్ముఖ్ జస్వంత్ ను వరెస్ట్ ప్లేస్ లో పెట్టి అతడిపై కూడా కొన్ని కామెంట్లు చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు తన మాటలను విని షాక్ అయ్యారు. ఇంటి నుండి బయటకు వెళ్తున్నా కూడా తనలో ఫైర్ మాత్రం తగ్గలేదు అంటూ విమర్శించారు. ఇక కొందరు నెటిజన్లు సరయు మాటల వెనుక బిగ్ బాస్ స్క్రిప్ట్ ఉందని ఇదంతా షన్ను ని ఫోకస్ చేసేందుకే ప్లాన్ చేసినట్లు ఉందని అంటున్నారు. ఇక మరికొందరు ఇదంతా ఆమెను ఎలిమినేట్ చేసినందుకే ఇలా అందరిపై విరుచుకుపడుతుంది అని అంటున్నారు. మరి ఈ కామెంట్స్ ను చూసి సరయు ఎలా స్పందిస్తుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Sarayu, Shanmukh jaswanth, Star Maa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు