Varsha Bollamma: వయసుపై నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన వర్ష బొల్లమ్మ?

varsha bollamma

Varsha Bollamma: తమిళ, మలయాళ నటి వర్ష బొల్లమ్మ. అంతే కాకుండా తెలుగు సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో తన అందంతో యువత మనసులను దోచుకుంది.

  • Share this:
    Varsha Bollamma: తమిళ, మలయాళ నటి వర్ష బొల్లమ్మ. అంతే కాకుండా తెలుగు సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో తన అందంతో యువత మనసులను దోచుకుంది. అంతేకాకుండా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో బాగా సందడి చేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది వర్ష. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

    2015 లో తమిళంలో విడుదలైన సతురన్ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత ఏడాది వరుస సినిమాలో నటించింది. ఇక 2018 లో కళ్యాణం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక గత ఏడాది చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది వర్ష. కానీ ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా లో నటించగా మంచి విజయం అందుకుంది.

    ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇక తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చటించగా.. ఓ నెటిజన్ తన వయసు గురించి ప్రశ్నించాడు. నీకు 25 ఏళ్లు అని గూగుల్ చూపిస్తుందని.. అది నిజమేనా అని అడుగగా.. వెంటనే వర్ష వెరైటీ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నేను మామూలుగా అయితే 96 లో పుట్టాను అంటూ.. అయితే నాకు 24 ఏళ్లు ఉండాలి కానీ నాకు తెలిసి ఈ విషయం మా అమ్మ కంటే గూగుల్ కే ఎక్కువ తెలిసి ఉండాలి అంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
    Published by:Navya Reddy
    First published: