NETIZENS QUESTIONING NIHARIKA KONIDELA OVER PROMOTING CHINA PRODUCT ONEPLUS MOBILE PK
Niharika Konidela: బాధ్యత ఉండక్కర్లా.. నిహారిక చేసిన పనికి నెటిజన్స్ ఫైర్..
నిహారిక కొణిదెల (Photo: Niharika Konidela)
Niharika Konidela: నిహారిక కొణిదెల కొన్ని రోజులుగా వరసగా వార్తల్లోనే ఉంటుంది. ఆమె పెళ్లి కూడా కుదరడంతో నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.
నిహారిక కొణిదెల కొన్ని రోజులుగా వరసగా వార్తల్లోనే ఉంటుంది. ఆమె పెళ్లి కూడా కుదరడంతో నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అయితే ఇన్ని రోజులు పాజిటివ్ ట్రెండింగ్ చూసిన మెగా డాటర్కు ఇప్పుడు విమర్శలు తగులుతున్నాయి. చాలా రోజుల తర్వాత మరో వివాదంలో ఇరుక్కుపోయింది నిహారిక. ఈమె చేసిన ఓ పనికి ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బాధ్యత ఉందా అంటూ మండి పడుతున్నారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
నిహారిక కొణిదెల (Niharika Konidela)
అంతగా నిహారిక ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా..? చైనా ప్రొడక్ట్ అయిన ఒన్ ప్లస్ ఫోన్కు ప్రమోషన్ చేసింది. OnePlus ఫోన్కు బ్రాండింగ్ చేస్తూ తన ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టింది నిహారిక. దాంతో నెటిజన్స్ ఆగ్రహిస్తున్నారు. ఓ వైపు దేశమంతా చైనా ప్రాడక్ట్స్ బ్యాన్ చేయాలని చెప్తుంటే.. నువ్వు మాత్రం ఇలా ప్రమోట్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. నువ్వు వాడినా పర్లేదు కానీ వాడుతున్నా అంటూ ఇలా ప్రమోషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్.. అసలు చైనా ఫోన్స్ అన్నీ తీసేయాలని చెప్తుంటే నువ్వు మాత్రం ఏకంగా ఈ ఫోన్ వాడమంటూ ప్రమోట్ చేస్తావా అంటూ అడుగుతున్నారు.
I am Niharika and I found #MyNord in acting. What’s yours? Follow #OneplusNord and share your story with #MyNord #OnePlusNord and stand a chance to win some cool merchandise.
OnePlus India
తెలిసి చేసిందో లేదంటే తెలియక చేసిందో తెలియదు కానీ నిహారిక మాత్రం చైనా ఫోన్ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయింది. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పలేకపోతుందిప్పుడు. ఇదిలా ఉంటే ఈమె చైతన్య జొన్నలగడ్డతో త్వరలోనే ఏడడుగులు నడవబోతుంది. ఆగస్టులో నిశ్చితార్థం.. డిసెంబరులో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.