NETIZENS PRAISES ANCHOR ANASUYA DANCE FOR KGF CHAPTER 2 MEHBOOBA SONG VIDEO GOES VIRAL SR
Anchor Anasuya : అనసూయ నీ అందం రోజు రోజుకు పెరుగుతోంది.. నెటిజన్స్ కామెంట్స్.. వీడియో వైరల్..
Anasuya Photo : Instagram
Anchor Anasuya : తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్. అనసూయ మొదట న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత, అనసూయ జబర్దస్త్, బిందాస్, మోడ్రన్ మహాలక్ష్మి, బూమ్ బూమ్, మాస్టర్ చెఫ్ వంటి అనేక ఇతర టీవీ షోలను హోస్ట్ చేశారు. అంతేకాదు ఓ వైపు హోస్ట్‌గా చేస్తూనే క్షణం, గాయత్రి, యాత్ర, థాంక్యూ బ్రదర్, రంగస్థలం, పుష్ప (Pushpa) మొదలైన అనేక హిట్ చిత్రాలలో నటించారు అనసూయ.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓ టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్. అనసూయ మొదట న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత, అనసూయ జబర్దస్త్, బిందాస్, మోడ్రన్ మహాలక్ష్మి, బూమ్ బూమ్, మాస్టర్ చెఫ్ వంటి అనేక ఇతర టీవీ షోలను హోస్ట్ చేశారు. అంతేకాదు ఓ వైపు హోస్ట్‌గా చేస్తూనే క్షణం, గాయత్రి, యాత్ర, థాంక్యూ బ్రదర్, రంగస్థలం, పుష్ప (Pushpa) మొదలైన అనేక హిట్ చిత్రాలలో నటించారు అనసూయ. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో అనసూయ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కెజియఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter2) నుంచి మెహబుబా అనే పాటకు తనదైన స్టైల్లో డాన్స్ చేస్తూ స్లో మోషన్లో వావ్ అనిపించారు. ఈ వీడియోకు మంచి లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్స్ ఎంతో అందంగా ఉన్నావు అనసూయ. రోజు రోజుకు నీ అందం పెరిగిపోతుందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం అనసూయ నువ్వు హీరోయిన్గా బాగుంటావు.. కెజీయఫ్ 3లో హీరోయిన్గా అవకాశం రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం అనసూయ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అది అలా ఉంటే తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోన్న అనసూయ ఒక్కో షోకి రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుంటారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
anchor anasuya Instagram
తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటారు. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్నారు. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్నారు. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న యాంకర్ అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా కనిపించనున్నారు. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని (Anchor Anasuya) తీసుకున్నారట.
anasuya Instagram
ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తున్నట్లు టాక్.. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తున్నారట అనసూయ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఇక అనసూయ ఇటీవల పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు.
ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ నెలలో మొదలుకావాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలా లేదని టాక్. దాదాపు మూడు నాలుగు నెలల వరకు ఈ రెండో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించట్లేదని అంటున్నారు. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో ఈ సినిమా విడుదల ఈ ఏడాదిలో ఉంటుందో లేదో చూడాలి.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.