హోమ్ /వార్తలు /సినిమా /

Ashu Reddy: ముందు స్నానం చేయ్.. వాసన వస్తోంది...అషురెడ్డిపై నెటిజన్ల దారుణ కామెంట్లు

Ashu Reddy: ముందు స్నానం చేయ్.. వాసన వస్తోంది...అషురెడ్డిపై నెటిజన్ల దారుణ కామెంట్లు

అషు రెడ్డి

అషు రెడ్డి

స్వయంవరంపై అషు రెడ్డి ఓ డబ్ స్మాష్ వీడియో చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నీ ముఖానికి అంత సీన్ లేదు. మేకప్ తీసి రీల్ చేస్తే.. ఒక్క లైక్ కూడా రాదంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియా వల్ల చాలామంది బుల్లితెరకు పరిచయం అయ్యారు. మరికొందరు ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిపోయారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) ఒకరు. ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో సందడి చేసిన ఆమె.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్(Bigg Boss) నుంచి బయటకు రాగానే హాట్ ఫొ‌టోలను షేర్ చేసింది.

సమంతలా కనిపించే అషు రెడ్డికు సోషల్ మీడియా(Social Media)లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఈ భామ చేసిన ఓ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నీకంత సీన్ లేదు.. గుర్రాలు కాదు కదా గాడిదలు మీద కూడా రారు అంటూ.. అషు పెట్టిన పోస్టుపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అషు రెడ్డి పెట్టిన వీడియోలో ఓ అబ్బాయి సోఫాలో కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చున్న అషు.. ఓ డైలాగ్స్‌కు డబ్ స్మాష్ చేసింది.‘ కాలం మారిపోయి పద్ధతులు మారిపోయగాయి గానీ.. నాకే గాని స్వయంవరం పెడితే.. ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్లో తెలుసా ’ అంటూ ఆమె డైలాగ్స్ చెబుతుంది. అక్కడ కూర్చున్న అబ్బాయి అషు రెడ్డి నెత్తిపై ఒక్కటి వేస్తాడు.

View this post on Instagram


A post shared by Ashu Reddy (@ashu_uuu)అయితే ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ మేకప్ తీసి రీల్స్ చేయు..కనీసం లైకులు కూడా రావు అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. మరొకరు గుర్రాలు కాదు గాడిదలు మీద వస్తుంటారు. గుర్రాలు వేసుకొని కాదు అషు.. ఫస్ట్ చీపురు తీసుకొని వస్తారు మీ మొహం లాగా.. అని మరొకరు కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ కుక్కల్ని వెంటపెట్టుకొని వస్తారేమో నీపై వదలడానికి... అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.స్నానం చేయ్ ఇప్పుడే వస్తారు అని మరో నెటిజన్.. ముందు షర్ట్ బటన్స్ పెట్టుకో అని మరోకరు ఇలా ఎవరికివారు అషు వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. ముందు స్నానం చేయ్ స్మెల్ వస్తుంది అని మరో నెటిజన్ అన్నారు. ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే అంటూ.. మరో నెటిజన్ ఘాటుగా అన్నాడు.

First published:

Tags: Ashu reddy, Bigg Boss, Bigg boss telugu

ఉత్తమ కథలు