బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటాని. తెలుగులో ఈ సినిమా లోఫర్ సినిమాతో వరుణ్ తేజ్ హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు రావడంతో ఇటు నుంచి అటు పోయింది. దిశా సినిమాలు, నటన కన్నా ఆమె చేసే బోల్డ్ ఫోటోషూట్స్ తో ఆమెకు పేరొచ్చింది. దిశా సోషల్ మీడియాలో సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా దిశా పటాని మరోసారి తన అందాలతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఎప్పటిలాగే స్కిన్ షో తో పిచ్చెక్కించింది.
ఇదంతా ఆమె ప్రియుడి చలవే అని చెప్పాలి. టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి 2 చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ముంబైలో సెలెబ్రిటీల కోసం ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. తన ప్రియుడి సినిమా కాబట్టి దిశా పటాని
సైతం ఈ సినిమాకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా దిశా పటాని వేసిన డ్రెస్సు... హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వేసుకున్న డ్రెస్సు లక్ష రూపాయలంట. అంతేకాదు.. ఆ డ్రెస్‌లో ఆమె అందాలు అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా అందాలన్నీ ఆరబోసింది.
క్లీవేజ్, థైస్ చూపిస్తూ.. మినీ బ్లూ డ్రెస్ లో దిశా మెరిసింది. నెక్ వద్ద ఆ డ్రెస్ డీప్ గా ఉండడంతో దిశా క్లీవేజ్ అందాలు మతిపోగొట్టేలా దర్శనం ఇస్తున్నాయి.
ఇక పొట్టి డ్రెస్సుతో పాటు.. ఓ చిన్న పర్సును కూడా దిశ తన చేతిలో చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడా పర్సుపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ కామెడీ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ పర్సులో ఏం దాచావు తల్లి అని కొందరు అంటుంటే... మరికొందరు అది పర్సు కాదు.. పెద్ద తాళం చెవిలా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంకొందరు.. ఆచిన్న పర్సులో ఏ పిండి తెచ్చుకున్నావు.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా సంగతి పక్కన పెడితే.. అక్కడకు వచ్చిన వారంతా దిశ డ్రెస్సు, పర్సు చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు ప్రియుడు నటించిన హీరో పంతి 2 స్క్రీనింగ్ తర్వాత దిశా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. సినిమా అద్భుతంగా ఉందని పేర్కొంది. టైగర్ ష్రాఫ్ ని ముద్దగా టిగ్గీ అని పిలుస్తూ.. నువ్ చంపేశావ్ టిగ్గీ అని కామెంట్స్ పెట్టింది. దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.